ఐపీఎల్ : కోహ్లీ Vs రాహుల్‌ గెలిచేది ఎవరో..?

ఐపీఎల్ 13 వ సీజన్ ఆలస్యంగా మొదలయ్యిన ఆసక్తికరంగా కొనసాగుతుంది. అయితే ఈరోజు మరో రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. గెలుపుతో టోర్నీని ఆరంభించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. గెలుపు అంచుల దాకా వచ్చి సూపర్‌ ఓవర్లో ఓటమి పాలైన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరు విరాట్‌ కోహ్లీ వర్సెస్‌ కేఎల్‌ రాహుల్ ‌గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక తొలి మ్యాచ్‌ కు దూరమైన క్రిస్ ‌గేల్‌ తుదిజట్టులోకి వచ్చేఅవకాశం ఉంది. అలాగే ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న మయాంక్‌ అగర్వాల్‌ పై పంజాబ్‌ ఆశలు పెట్టుకుంది.

అలాగే పంజాబ్‌ పేస్‌ బౌలింగ్‌.. బెంగుళూర్ కన్నా మెరుగ్గా ఉంది. ఇక గత మ్యాచ్ లో తన బౌలింగ్ తో మాయ చేసిన చాహల్మ పై మరోసారి ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్‌ మొదటి మ్యాచ్ ‌లోనే అర్ద సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ తో పాటు డివిలియర్స్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో అత్యధికంగా పరుగులు ఇచ్చిన సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.