ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు ఎఫ్ 3, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్, ఆచార్య వంటి మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలో మరో మల్టీస్టారర్ చిత్రం రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారత సినీ చరిత్రలోనే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న దర్శకుడు శంకర్ ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ మూవీ తెరకెక్కించనున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ 15వ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందనుందని, ఇందులో చరణ్‌తో పాటు పవన్ కళ్యాణ్‌ను మరో హీరోగా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. కాని ప్రస్తుతం పవన్ రాజకీయాలు, సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఈ సినిమా చేయలేనని అన్నారట. దీంతో తమిళ స్టార్ హీరోని వెతికే పనిలో ఉన్నారట. అఫీషియల్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.