ATM: ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారో, ఇక అంతే..!

ATM: ఈ రోజుల్లో జేబులు నిండ‌డం లేదు కాని చిల్లులు మాత్రం ప‌డుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు చార్జీల మోత మ్రోగిస్తుంటే సామాన్యుడు జీవితం అయోమ‌యంగా మారింది. బ్యాంకులు కూడా ఇందుకు మిన‌హాయింపు ఏమి కాదు. క‌స్ట‌మ‌ర్స్ నుండి బ్యాంకులు చార్జీల రూపంలో దొరికిన కాడికి దోచేస్తున్నాయి. ఏవేవో ఇంట్రెస్ట్‌లు అంటూ క‌స్ట‌మ‌ర్ల జేబుల‌కి చిల్లు పెడుతుంది. గ‌తంలో ఏటీఎం నుండి న‌గ‌దు విత్ డ్రా చేసే విష‌యంలో బ్యాంకులు కొన్ని కండీష‌న్స్ పెట్టిన విష‌యం తెలిసిందే.

ATM

సొంత బ్యాంకు ఏటీఎం నుండి న‌గ‌దు డ్రా చేయాలంటే 5 ట్రాన్సాక్ష‌న్స్ ఉచితం. మెట్రోల్లో అయితే ఇతర బ్యాంకు ఏటీఎంలల్లో మూడు ట్రాన్సాక్షన్స్ ఉచితం. నాన్ మెట్రోల్లో ఐదు లావాదేవీలు ఉచితం. ఇందులో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి.నాన్ ట్రాన్సాక్ష‌న్స్ అంటే బ్యాలెన్స్ చెక్ చేయ‌డంతో ఇత‌ర సేవ‌లు అన్న‌ట్టు. అయితే బ్యాంకు వారు ఇచ్చిన ప‌రిమితి క‌న్నా ఎక్కువ సార్లు లావా దేవీలు జ‌రిపితే ఛార్చీలు వాయించ‌డం ఖాయం.

ఆర్ బీ ఐ ఏటీఎం ఛార్జీలను పెంచి కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టింది . ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినా, ఇతర సేవలు ఉపయోగించినా కొన్నిసార్లే ఉచితం. అయితే ప‌రిమితి మించి డ్రా చేస్తే ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎంలో క్యాష్ ట్రాన్సక్షన్స్ మాత్రమే కాదు… నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ ఛార్జీలు కూడా పెరిగాయి. ఒక నెలలో ఉచిత లావాదేవీల కన్నా ఎక్కువ సార్లు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేస్తే ప్రతీ లావాదేవీకి ప్రస్తుతం రూ.20 చెల్లిస్తున్నారు కస్టమర్లు. ఈ ఛార్జీలను రూ.21 కి పెంచింది ఆర్‌బీఐ. పెరిగిన ఛార్జీలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.

ATM

ఏటీఎం లావాదేవీల ఇంట‌ర్‌చేంజ్ ఫీజు కూడా పెంచింది ఆర్‌బీఐ. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఛార్జీని రూ.15 నుంచి రూ.17 కి, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఛార్జీని రూ.5 నుంచి రూ.6 కి పెంచింది. ఈ ఛార్జీలు 2021 ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తాయి. 2012లో ఇంట‌ర్ ఛేంజ్ ఫీజ్ మార‌గా, 2014 ఆగ‌స్ట్ నుండి క‌స్ట‌మ‌ర్స్ చెల్లించే ఛార్జీలు అమ‌లులోకి వ‌చ్చాయి. అయితే ఇటీవ‌లి కాలంలో ఛార్జీలు ఏమి పెంచ‌ని కార‌ణంగా ఆర్బీఐ ఛార్జీలు పెంచేందుకు అనుమ‌తినిచ్చింది.

ఛార్జీలు పెంచడం కోసం ఆర్‌బీఐ 2019 జూన్‌లోనే కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2020 జూలైలో సిఫార్సులు ఇచ్చింది. కమిటీ సిఫార్సులను పరిశీలించిన తర్వాత ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాబ‌ట్టి బ్యాంక్ క‌స్ట‌మ‌ర్స్ ఏటీఏం లావాదేవీలు జ‌రిపేటప్పుడు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది.