Ravindra Jadeja : ఐపీఎల్‌ హీరో గారి ఎమ్మెల్యే భార్య స్టేడియంలోని ఫోటోలు వైరల్‌

NQ Staff - May 30, 2023 / 06:46 PM IST

Ravindra Jadeja : ఐపీఎల్‌ హీరో గారి ఎమ్మెల్యే భార్య స్టేడియంలోని ఫోటోలు వైరల్‌

Ravindra Jadeja : రసవత్తరంగా సాగిన ఐపీఎల్‌ – 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఫైనల్‌ మ్యాచ్ లో వర్షం దోబూచులాడింది. చాలా కష్టపడి స్టేడియం సిబ్బంది మ్యాచ్ కు గ్రౌండ్‌ ను సిద్దం చేయడం జరిగింది. గుజరాత్‌ మరియు చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో చెన్నై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ విజయం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ చెన్నై అద్భుతంగా రాణించింది. ధోనీ జీరో పరుగులకే ఔట్‌ అయినా కూడా అద్భుతంగా రవీంద్ర జడేజా ఆడి చివరి బంతికి విజయాన్ని కట్టబెట్టిన విషయం తెల్సిందే. అయితే జడేజా విజయాన్ని స్టేడియంలోకి వచ్చి మరీ ఆయన భార్య రివాబా జడేజా ఎంజాయ్ చేసింది.

రివాబా జడేజా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకురాలు అయిన రివాబా జడేజా 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర జామ్ నగర్ నుండి పోటీ చేసి ఏకంగా 50 వేలకు పైగా భారీ ఓట్ల మెజారిటీ తో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.

Ravindra Jadeja Victory Was Enjoyed By Rivaba Jadeja Who Came Stadium

Ravindra Jadeja Victory Was Enjoyed By Rivaba Jadeja Who Came Stadium

ఒక ఎమ్మెల్యేగా ఆమె ఇలా బయటకు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టేడియంలో ఎమ్మెల్యే గారు అంటూ రివాబా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఫోటోలపై మీరు ఒక లుక్కేయండి.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us