Ravi Teja Star Hero In Tollywood : పవన్ కల్యాణ్ వల్లే రవితేజ స్టార్ హీరో అయ్యాడని మీకు తెలుసా..?
NQ Staff - July 4, 2023 / 11:51 AM IST

Ravi Teja Star Hero In Tollywood :
రవితేజ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నాడు. ఎవరి అండ లేకుండా ఇంత పెద్ద హీరో కావడం అంటే మాటలు కాదు. చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన ఆయన.. ఈ రోజు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే రవితేజ ఇంత పెద్ద హీరో కావడానికి కారణం పవన్ కల్యాణ్. అవును మీరు విన్నది నిజమే.
రవితేజను స్టార్ హీరోను చేసిన సినిమా విక్రమార్కుడు. అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న రవితేజను.. ఈ మూవీ ఓవర్ నైట్ లో తిరుగులేని క్రేజ్ ను, స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన రాజమౌళి రవితేజ కెరీర్ ను మార్చి పడేశాడు. అయితే ఈ మూవీని వాస్తవంగా పవన్ కల్యాణ్ చేయాల్సింది.
పవన్ కు కథ చెప్పిన జక్కన్న..
పవన్ కల్యాణ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ కథ రాయించుకున్నాడు రాజమౌళి. ఎలాగైనా పవన్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆ కథ చెప్పాడు మన జక్కన్న. కానీ అప్పటికే పవన్ చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. కథ చాలా బాగున్నా.. తాను ఇప్పట్లో ఆ సినిమా చేయలేను అంటూ చెప్పాడంట పవన్.

Ravi Teja Star Hero In Tollywood
దాంతో రాజమౌళి నిరాశ పడ్డాడు. వెంటనే పవన్ ఈ కథకు రవితేజ అయితే బాగా సూట్ అవుతాడేమో ఒకసారి ఆలోచించండి అంటూ చెప్పాడంట. దాంతో రాజమౌళి కూడా ఆలోచనలో పడ్డాడు. రవితేజను పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూస్తే జనాలకు కొత్తగా ఉంటుందని రాజమౌళి భావించాడు. వెంటనే ఆ కథతో రవితేజతో సినిమా చేశాడు. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలైపోయాయి. అలా పవన్ చేసిన సాయం వల్లే రవితేజ స్టార్ అయ్యాడన్నమాట.