Ravi Shastri: తనపై వచ్చిన వార్తలకు స్పందించిన రవిశాస్త్రి.. బుక్ లాంచింగ్‌కి వెళ్లినందుకే కరోనా వచ్చిందా?
NQ Staff - September 12, 2021 / 05:57 PM IST

Ravi Shastri: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక ఐదవ టెస్ట్ మ్యాచ్ కరోనా వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. రవిశాస్త్రికి ముందుగా కరోనా రాగా, ఆ తర్వాత డంతో రద్దు చేయక తప్పలేదు. టీమిండియాలో మొదటి కోవిడ్ పాజిటివ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి తేలాడు. అతని తర్వాత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాడు. అలాగే టీమ్ ఫిజియో నితిన్ పటేల్, మరొక ఫిజియో యోగేష్ పర్మార్ కూడా పాజిటివ్ తేలారు.
టీమిండియాకు సంబంధించిన సపోర్టింగ్ స్టాఫ్‌కి కరోనా రావడంతో ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు ఆసక్తి చూపలేదు.మ్యాచ్ క్సాన్సిల్ కావడంతో అందరు హెడ్ కోచ్ రవిశాస్త్రిని నిందించారు. నాల్గవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు రవిశాస్త్రి తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విరాట్ కోహ్లీ కూడా ఇందులో పాల్గొన్నారు. ఆంగ్ల మీడియా ప్రకారం, ఈ కార్యక్రమంలో కోవిడ్ నియమాలు పూర్తిగా పట్టించుకోలేదు.
చాలా మంది మాస్క్‌లు ధరించకుండా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇదే టైంటో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనంతరం రవిశాస్త్రికి లక్షణాలు కనిపించాయి. దీంతో ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున శాస్త్రి లేకుండానే టీమిండియా మైదానానికి చేరుకుంది. అయితే ఐదో టెస్ట్ మ్యాచ్ మాత్రం ఆడలేకపోయింది.
అయితే రవిశాస్త్రి మాత్రం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లపైనే విమర్శలు చేయడం విశేషం… ‘ఇంగ్లాండ్ మొత్తంలో ఎలాంటి ఆంక్షలు లేవు, కచ్ఛితంగా మాస్క్ ధరించాలనే నిబంధనలు కూడా లేవు. క్రీజులోకి ఫ్యాన్స్ దూసుకువస్తుంటే ఏం చేశారు… కేవలం నా బుక్ లాంఛింగ్ ప్రోగ్రామ్ వల్లే కరోనా వచ్చిందా… ఇంత స్వేచ్ఛ ఉన్నప్పుడు వైరస్ ఎలాగైనా సోకి ఉండొచ్చు…’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి.
ఈ సిరీస్‌లో జార్వో అనే ప్రేక్షకుడు, ఏకంగా మూడు సార్లు మైదానంలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకే వ్యక్తి, మూడు సార్లు సెక్యూరిటీని దాటుకుని, మైదానంలో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.