Ravi shastri :టీం స్క్వాడ్‌పై ర‌విశాస్త్రి సంచల‌న వ్యాఖ్య‌లు.. 11 మందినే మేం ఎంపిక చేస్తాం

Ravi shastri:టీ20 వరల్డ్ కప్ లో తన చివరి లీగ్ మ్యాచ్ ను నమీబియాపై ఆడిన టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీ అనంతరం భారత టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. త‌న ప‌దవీ కాలం పూర్తైన త‌ర్వాత ర‌విశాస్త్రి.. బీసీసీఐ, ఐసీసీల‌పై మండిప‌డ్డారు.

ravi shastri
ravi shastri

టీమిండియా పరిస్థితికి బీసీసీఐ, ఐసీసీనే కారణమని ఆరోపించారు. గుక్కతిప్పుకోలేనంత బిజీ షెడ్యూల్ ఏర్పాటు చేసి టీమిండియా ఓటములకు పరోక్షంగా కారణమయ్యాయని మండిపడ్డారు. గత 6 నెలలుగా టీమిండియా ఆటగాళ్లు బయోబబుల్ లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆటగాడు అయినా శారీరకంగా, మానసికంగా అలసిపోతారని వివరించారు. క్రికెటర్లు కూడా మనుషులేనని, పెట్రోల్ పోసి నడపడానికి వారేమీ యంత్రాలు కాదని రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ravi shastri
ravi shastri

వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ముందు ఏ జట్టు అయినా తాజాగా ఉండాలని కోరుకుంటుందని, కానీ భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదని అన్నారు. ఆటగాళ్లకు ఏమాత్రం వ్యవధి ఇవ్వకుండా బీసీసీఐ, ఐసీసీ షెడ్యూల్ రూపొందించాయని విమర్శించారు. క్రికెటర్లు కూడా మానవమాత్రులేనన్న సంగతిని బోర్డులు, అభిమానులు గుర్తించాలని పేర్కొన్నారు.

అయితే తాజాగా ర‌విశాస్త్రి మ‌రో బాంబ్ పేల్చారు. టీమిండియా స్క్వాడ్ సెల‌క్ష‌న్ కోహ్లీ, త‌న చేతిలో ఉండేది కాద‌ని అన్నాడు.మేము ప‌ద‌కొండు మందిని సెల‌క్ష‌న్ చేసుకునేవాళ్లం అంటే ర‌విశాస్త్రి కామెంట్ చేశాడు. ఇప్పుడు ఆయ‌న వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ravi shastri
ravi shastri

శాస్త్రి స్థానంలో రాహుల్‌ ద్రవిడ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూజీలాండ్ పర్యటన ద్వారా రాహుల్ రంగంగంలోకి దిగనున్నాడు.