Mahabubabad: ఎంత పని చేశావే ఎల‌కా.. వృద్ధుడి ప‌రిస్థితి ఏంటో మ‌రి!

Mahabubabad: ఈ రోజుల్లో ఒక రూపాయి సంపాదించాలంటే చాలా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగాలి. క‌ష్ట‌ప‌డి సంపాదించిన మొత్తం పోగొట్టుకోకుండా ఉండేందుకు చాలా జాగ్ర‌త్తలు తీసుకోవాలి. మ‌నం సంపాదించిన మొత్తంలో ప‌ది రూపాయ‌లు వృధాగా పోయిన కూడా చాలా బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అలాంటిది రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు వృధాగా పోగొట్టుకున్నాడు ఓ వృద్ధుడు.

Mahabubabad

అనారోగ్యం బారిన పడిన ఓ వృద్ధుడు శస్త్రచికిత్స కోసం దాచుకున్న డబ్బును ఎలుకలు కొరికేశాయి. వంద‌లు వేలు అయితే కొంత ఉప‌శ‌మ‌నం పొందేవాడేమో కాని అవి ఏకంగా రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ట‌. డ‌బ్బులు మొత్తాన్ని కొరికేసి ఎందుకు ప‌నికి రాకుండా చేశాయ‌ట‌. శ‌స్త్ర చికిత్స కోసం దాచుకున్న డ‌బ్బు ఇలా వృధా కావ‌డంతో వృద్ధుడు బోరున విల‌పిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారు ఇందిరానగర్ తండాకు చెందిన రెడ్యా కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూ ఉదయాన్నే టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తాడు. కూరగాయలు అమ్మగా వచ్చిన దాంతోనే కాలం వెల్లదీస్తున్నారు. వృద్ధాప్యంలోనూ కష్టపడుతూ తన కాళ్లపై తాను నిలబడుతున్నారు. కొంత కాలంగా అత‌డికి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

Mahabubabad

ఓసారి ఆసుప‌త్రికి వెళ్లి ప‌రీక్షించుకోగా క‌డుపులో క‌ణితి పెరుగుతూ ఉంద‌ని , అది తీసివేయాలంటే చాలా ఖర్చ‌వుతుంద‌ని అన్నారు. అధైర్య పడకుండా కూరగాయలు అమ్ముకుంటూ యాబై వేల రూపాయ‌లు సంపాదించ‌గా, వాటిని జాగ్ర‌త్త‌గా దాచుకున్నారు.ఆప‌రేష‌న్ కోసం రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని అప్పుగా తెచ్చి బీరువాలో దాచిపెట్టారు.

అయితే ఆపరేషన్ చేయించుకుందామని నగదును తీసి చూసిన రెడ్యా షాక్ తిన్నాడు. కరెన్సీ నోట్లను ఎలుకలు కొట్టేయడంతో విలపిస్తున్నారు. ఎన్ని బ్యాంకులు తిరిగిన ఎలుకలు కొరికిన డబ్బును తీసుకోనన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. వారు ఏమంటారో అని వృద్దుడు ఆందోళ‌న చెందుతున్నాడు.