Bigg Boss House : రతిక ఎలిమినేట్.. ఆ పని చేసి ఇరుక్కుపోయిన పల్లవి ప్రశాంత్..!

NQ Staff - November 27, 2023 / 09:38 AM IST

Bigg Boss House  : రతిక ఎలిమినేట్.. ఆ పని చేసి ఇరుక్కుపోయిన పల్లవి ప్రశాంత్..!

Bigg Boss House  :

బిగ్ బాస్ లో గత వారం ఎలాంటి ఎలిమినేషన్లు లేవు. దాంతో అప్పుడు అదరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ పన్నెండో వారం ముగింపులో మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందే చెప్పారు నాగార్జున. ఇక శనివారం అశ్విని శ్రీ హౌస్ ను వీడింది. ఆమెను ఎవరూ నామినేట్ చేయలేదు. ఆమెకు ఆమెనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. అయితే ఆమె వెళ్లిపోతూ నాగార్జునతో మాట్లాడింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమె తన జర్నీని స్క్రీన్ మీద చూసుకుని ముచ్చట పడిపోయింది. అంతే కాకుండా కొన్ని అభిప్రాయాలను కూడా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సందర్భంగా ఇప్పుడుఉన్న బ్యాచ్ లలో హిట్, ఫట్ ఎవరనే దానిపై తన ఫీలింగ్ ను తెలుసుకున్నారు. హౌజ్ లోని మూడు బ్యాచ్ లకు నాగార్జున పేర్లు పెట్టేసి అడిగారు. శోభా, ప్రియాంక, అమర్ లకు స్పా/చుక్క బ్యాచ్ అని, శివాజీ, యావర్, ప్రశాంత్ లకుస్పై/మొక్క బ్యాచ్ అని, మిగితాది తొక్క బ్యాచ్ అంటూ హౌజ్ లోని బ్యాచ్ లపై సరదా ఫన్నీకామెంట్లు చేశారు. ఇలా జరిగిన తర్వాత అశ్విని హౌస్ ను వీడిపోయింది. ఆమె వెళ్లిపోగా హౌస్ లో శివాజీ, అమర్, గౌతమ్, శోభాశెట్టి, రతిక, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, యావర్, అర్జున్ ఉన్నారు. అయితే వీరిని రెండు బ్యాచ్ లుగా విడదీశారు నాగార్జున. స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ గా విడగొట్టారు.

Rathika Rose Eliminated By Bigg Boss House

Rathika Rose Eliminated By Bigg Boss House

ఇలా విడగొట్టిన వీరిలో ఒక్కొక్కరికి మార్కులు అందజేశారు. అర్జున్ వీరికి సంచాలకుడిగా పని చేశాడు. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న వస్తువులు, ఇంటిరియర్, ఫర్నీచర్, ఇతర వాటిపై కొన్ని ప్రశ్నలు వేశారు నాగార్జున. ఇలా మరిన్ని గేమ్స్ తో హౌజ్ లో కాసేపు సరదాగా గడిపేలా చేశారు నాగార్జున. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిని సేఫ్ గేమ్ ఆడించారు. ముందుగా అమర్ దీప్, గౌతమ్ సేవ్ అయిపోయారు. తర్వాత పల్లవి ప్రశాంత్ సేఫ్ అయ్యారు. ఆ నెక్ట్స్ యావర్, శివాజీ కూడా సేఫ్ అయ్యారు. కానీ చివరకు అర్జున్ తో పాటు రతిక నామినేషన్స్ లో మిగిలారు.

వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుందని చెప్పారు నాగార్జున. అయితే పల్లవి ప్రశాంత్ తన ఎవిక్షన్ పాస్ ను వాడాలని నాగార్జున చెప్పారు. కానీ తాను పద్నాలుగో వారంలో దాన్ని వాడుతానని చెప్పాడు ప్రశాంత్. ప్రియాంక ఎంత బతిమాలినా సరే పట్టించుకోలేదు.

దాంతో చేసేది లేక ఫైనల్ గా రతికను ఎలిమినేట్ చేసేశారు బిగ్ బాస్. రతిక ఇప్పటికే ఓ సారి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో అవకాశం ఇచ్చారు. కానీ వచ్చిన ఛాన్స్ ను కూడా ఆమె సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. ఇక ఆమె వెళ్లిపోగా ప్రస్తుతం ఎనిమిది కంటెస్టెట్లు ఉన్నారు. ఇందులో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us