Rathika Rose Angry with Housemates : సొంత టీమ్ ను మళ్లీ తిట్టిన రతిక.. ఆ ఇద్దరిపై బూతులు మాట్లాడిన అమర్ దీప్..!
NQ Staff - September 15, 2023 / 10:52 AM IST

Rathika Rose Angry with Housemates :
బిగ్ బాస్-7 సీజన్ లో గత 13వ ఎపిసోడ్ లో మాయాస్త్ర కోసం రెండు టీమ్ లు మహాబలి, రణధీర పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇందులో మాయాస్త్ర కోసం పోటీ పడే కంటెస్టెంట్లుగా శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా విజయం సాధించి ఇక సెప్టెంబర్ 14వ ఎపిసోడ్ లో వారంతా కంటెండర్లుగా సెలెక్ట్ అయ్యారు. వారికి తల ఒక మాయాస్త్ర భాగం వచ్చింది అయితే ఒకరి దగ్గర ఉన్న మాయాస్త్ర భాగాన్ని మరొకరికి ఇచ్చి ఆఖరకు ఇద్దరిని ఫైనల్ చేయాల్సిందిగా మహాబలి టీమ్ కు బిగ్ బాస్ ఆదేశించారు. దాంతో మహాబలి టీమ్ దొరికిందే సందు అన్నట్టు రెచ్చిపోయింది.
మందుగా వచ్చిన శుభ శ్రీ.. శోభాశెట్టి కంటే ప్రిన్స్ వారియర్ గేమ్ బాగా ఆడాడని చెప్పింది. శోభాశెట్టి వద్ద ఉన్న మాయాస్త్రను ప్రిన్స్ యావర్ కు ఇచ్చేసింది. తర్వాత వచ్చిప పల్లవి ప్రశాంత్ తనను టార్గెట్ చేసిన అమర్ దీప్ మీద రివేంజ్ తీర్చుకున్నాడు. అమర్ దీప్ తాను అనుకున్నంత బాగా ఆడలేదని చెప్పాడు. అమర్ దీప్ వద్ద ఉన్న మాయాస్త్రను శివాజీకి ఇచ్చాడు. అయితే మూడో స్థానంలో రతికను పంపించాలని అంతా అనుకున్నారు. కానీ ఆమె వెళ్లలేదు. తాను ఆరో స్థానంలో వెళ్తేనే తాను అనుకన్న వారిని ఫైనల్ చేయొచ్చని ఆమె మొండికేసింది.
దీంతో మహాబలి పదే పదే చెప్పడంతో రతిక కోపం కంట్రోల్ చేసుకోలేక వారి మీద అరిచేసింది. నువ్వు గట్టిమా మాట్లాడితే నేను కూడా అరవగలను అంటూ దామిని మీద ఫైర్ అయింది. ఇంకేముంది దామిని ఏడ్చేసింది. ఇక లాభం లేదనుకుని మూడో స్థానంలో వెళ్లిన దామిని.. ప్రియాంక భాగాన్ని షకీలాకు ఇచ్చింది. ఇక నాలుగో స్థానంలో వెళ్లమని ఆట సందీప్, గౌతమ్ కృష్న చెప్పారు. దాంతో రతిక మళ్లీ సీరియస్ అయింది. అంతా చెండాలంగా ఉంది. ఈ టీమ్ అంతా బఫూన్స్ అంటూ కామెంట్స్ చేసింది. ఇలా వారు వాగ్వాదంతో బీభత్సం సృష్టించారు. దీంతో బిగ్ బాస్ కల్పించుకున్నారు.
తర్వాత నాలుగో స్థానంలో ఎవరు రావాలో రణధీర టీమ్ డిసైడ్ చేస్తుందని చెప్పాడు. దాంతో పాటు రణధీర టీమ్ లో ఎవరి వద్ద అయితే మాయాస్త్ర లేదో వారు ఆటలో లేనట్టే అని చెప్పాడు. అంటే శోభాశెట్టి, అమర్ దీప్ పక్కకు తప్పుకోవాలి. దీంతో అమర్ దీప్ కోపంతో ఊగిపోయాడు. రెండు రోజులుగా అంత కష్టపడి ఆడితే చిన్న కారణంతో తప్పుకోవాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక తన మాయాస్త్రను తీసేసిన పల్లవి ప్రశాంత్ మీద అరిచాడు. ప్రశాంత్ చెప్పింది పాయింటే కాదని.. ఎందుకు వస్తారో అంటూ అన్నాడు.
ప్రశాంత్ వల్ల మాయాస్త్ర పోయిందని.. ఇక రతిక వల్ల బిగ్ బాస్ ఎంటర్ అయి తనను ఆటలో నుంచి తీసేశాడని ఆగ్రహంతో ఊగిపోయిన అమర్ దీప్.. వారిద్దరినీ బూతులు తిట్టాడు. అతని తిట్లకు బిగ్ బాస్ బీప్ సౌండ్ వేశాడు. దాంతో శోభాశెట్టి రియాక్ట్ అయింది. మనం ఒక షోలో ఉన్నామని గుర్తు పెట్టుకుని మాట్లాడు అంటూ చెప్పింది. ఇలా బిగ్ బాస్ మొత్తం రచ్చ రచ్చగా సాగిపోయింది. మాయాస్త్ర ఇంకా ఫైనల్ కంటెస్టెంట్ తెలియలేదు.