Rathika Prince Yawar Love Track : మరొకరితో లవ్ ట్రాక్ మొదలెట్టిన రతిక.. బాడీ బిల్డర్స్ మధ్య ఘోరమైన ఫైట్..!

NQ Staff - September 16, 2023 / 10:32 AM IST

Rathika Prince Yawar Love Track : మరొకరితో లవ్ ట్రాక్ మొదలెట్టిన రతిక.. బాడీ బిల్డర్స్ మధ్య ఘోరమైన ఫైట్..!

Rathika Prince Yawar Love Track :

బిగ్ బాస్ లో ఇప్పుడు పవర్ అస్త్రా కోసం వార్ నడుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్లు రెండు టీమ్ లు గా విడిపోయి దీని కోసం పోరాడిన సంగతి తెలిసిందే. రణధీర టీమ్ నుంచి ఆరుగురు పోటీ పడగా.. చివరకు శివాజీ, షకీలాను ఉంచారు మహాబలి టీమ్. ఈ క్రమంలోనే మహాబలి టీమ్ కెప్టెన్ గౌతమ్ కృష్ణ, రణధీర కంటెండర్ ప్రిన్స్ యావర్ మధ్య ఘోరమైన ఫైట్ జరిగింది. ఈ సందులోనే రతిక ఎంటర్ అయింది. తాను ప్రిన్స్ యావర్, శివాజీలకే మాయాస్త్ర టీమ్ ఇవ్వాలని చెప్పానని.. కానీ మహాబలి టీమ్ వినలేదని చెప్పింది రతిక. వాస్తవాననికి రతిక శివాజీ, షకీలాకే మద్దతు తెలిపింది.

కానీ ప్రిన్స్ యావర్ గొడవకు దిగడంతో ప్లేటు తిప్పేసింది. మొత్తానికి అవసరానికి బట్టి అబద్ధాలు ఆడేసింది. యావర్ కంటే షకీలా ఎందులో బాగా పర్ఫార్మెన్స్ చేసింది అంటూ మహాబలి టీమ్ మీదే అరిచేసింది రతిక. సొంత టీమ్ మీద రతిక అరవడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఇలాగే చేసింది. వాస్తవానికి రతిక మీద ప్రిన్స్ మొదటి నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రిన్స్ ను రతిక కూడా ఎంకరేజ్ చేస్తూ క్లోజ్ గా మూవ్ అవుతోంది. అందుకే ఇప్పుడు ప్రిన్స్ కోసం సొంత టీమ్ మెంబర్స్ నే తిట్టేసింది. పల్లవి ప్రశాంత్, శివాజీ పక్కన ఉండగానే బిగ్ బాస్ నేను రతకిను ఇష్టపడుతున్నాను అని ప్రిన్స్ చెప్పాడు.

తానేం తక్కువ తినలేదని రతిక కూడా అతనికి ఐ లైక్ యూ అంటూ చెప్పేసింది. ఇక శివాజీ వారిద్దరి మధ్య మరింత పోప్ కలిపేందుకు ప్రయత్నించాడు. నీకు అబ్బాయిల్లో ఎవరు ఇష్టం అని ప్రిన్స్ ను అడగ్గా.. నాకు ఓన్లీ అమ్మాయిలే ఇష్టం అంటూ ప్రిన్స్ చెప్పడంతో రతిక సిగ్గుపడుతూ నవ్వేసింది. ఇక అంతటితో ఆగకుండా ప్రిన్స్ మరింత రెచ్చిపోయాడు. గార్డెన్ లో ఉన్నప్పుడు నా గుండె నీ కోసమే కొట్టుకుంటుంది అన్నట్టు హార్ట్ సింబల్ వేసి చూపించాడు చేతులతోనే. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న పల్లవి ప్రశాంత్.. నువ్వు రతికను లవ్ చేస్తున్నావా అని ప్రిన్స్ ను అడిగాడు.

తనది చాలా మంచి హార్ట్. ఇవాళే నాకు అర్థమైంది అని ప్రిన్స్ అన్నాడు. వెంటనే రియాక్ట్ అయిన పల్లవి ప్రశాంత్.. అదంతా నమ్మకురా నాయనా.. తర్వాత మోసపోతావ్ అంటూ బదులిచ్చాడు. ఇక తర్వాత బాల్కనీలోకి వచ్చి కూర్చున్న రతిక, శోభాశెట్టి ప్రిన్స్ గురించి చర్చ పెట్టారు. శోభాశెట్టి కూడా ప్రిన్స్ మీద మనసు పారేసుకుందని అర్థం అవుతోంది. ఎందుకంటే గౌతమ్ కంటే తనకు ప్రిన్స్ క్యూట్ గా అనిపిస్తాడని చెప్పింది.

ఇక రతిక కూడా రెచ్చిపోయింది. నాకు ముందు నుంచి గౌతమ్ నచ్చడు కేవలం ప్రిన్స్ మాత్రమే నచ్చుతాడు అని చెప్పింది. ఇలా వారిద్దరూ ప్రిన్స్ కోసం ఆరాట పడుతున్నారు. అయితే గతంలో పల్లవి ప్రశాంత్ తో రతిక లవ్ ట్రాక్ నడిపింది. తర్వాత అతనికే వెన్ను పోటు పొడిచింది. మరి రేపు ప్రిన్స్ పరిస్థితి కూడా అదే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. మరి ఎప్పటికప్పుడు ప్లేటు తిప్పేస్తున్న రతిక.. ప్రిన్స్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us