Rashmika Mandanna : రష్మికను కోడలిగా ఒప్పుకున్న విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ.. ఇదే సాక్ష్యం..!

NQ Staff - February 2, 2023 / 12:52 PM IST

Rashmika Mandanna : రష్మికను కోడలిగా ఒప్పుకున్న విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ.. ఇదే సాక్ష్యం..!

Rashmika Mandanna : గత కొంత కాలంగా రష్మిక, విజయ్‌ దేవరకొండకు సంబంధించిన న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. పైగా వెకేషన్ల పేరుతో ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఇద్దరూ కూడా ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా రాణిస్తున్నారు.

ఇద్దరూ కలిసి గీతా గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో కూడా కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత మళ్లీ కలిసి నటించలేదు. అయినా కూడా ఇద్దరూ బయట వెకేషన్లకు వెళ్తున్నారు.

Rashmika Mandanna Went On Trip Dubai With Vijay Devarakonda Family

Rashmika Mandanna Went On Trip Dubai With Vijay Devarakonda Family

దుబాయ్‌ ట్రిప్‌కు..

మొన్నటికి మొన్న న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరూ కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. రష్మిక అప్పుడు లైవ్‌ పెడితే అందులో సడెన్‌ గా విజయ్‌ దేవరకొండ వాయిస్‌ కూడా వినిపించింది. దాంతో ఇద్దరి మధ్య లవ్‌ ను కన్ఫర్మ్‌ చేశారు నెటిజన్లు, వారి ఫ్యాన్స్‌. అయితే తాజాగా విజయ్‌ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ ట్రిప్‌కు వెళ్లాడు.

Rashmika Mandanna Went On Trip Dubai With Vijay Devarakonda Family

Rashmika Mandanna Went On Trip Dubai With Vijay Devarakonda Family

ఈ ట్రిప్‌ లో విజయ్‌ తో పాటు రష్మిక కూడా పాల్గొంది. ఇప్పుడు విజయ్‌, రష్మిక ఉన్న పిక్‌ వైరల్ అవుతోంది. విజయ్‌ ఫ్యామిలీ ట్రిప్‌ లోకి రష్మిక కూడా వెళ్లింది అంటే రష్మికను కోడలిగా విజయ్‌ ఫ్యామిలీ ఒప్పుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. త్వరలోనే పెండ్లి ఉంటుందేమో అంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us