Rashmika Mandanna Video Goes Viral : బాబోయ్.. పచ్చి బూతులు మాట్లాడిన రష్మిక.. ఇదేం తీరు పాప..!
NQ Staff - July 12, 2023 / 10:10 AM IST

Rashmika Mandanna Video Goes Viral :
రష్మిక మందన్నా అంటే ఇప్పుడు నేషనల్ క్రష్ అని అందరికీ తెలిసిందే. సౌత్ నుంచి నార్త్ దాకా అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ భామ. ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ బడా ప్రాజెక్టులే కావడం విశేషం. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు ఉన్నంత ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదనే చెప్పుకోవాలి.
పైగా ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. అందుకే రష్మిక వరుసగా సినిమాల్లో నటించేస్తుంది. ఇక విజయ్ దేవరకొండతో లవ్ ట్రాక్ అంటూ బాగానే హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి వెకేషన్లు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు రష్మిక ముంబైలోనే ఉంటుంది.
వీడియో వైరల్..
కానీ కావాల్సినప్పుడు హైదరాబాద్, చెన్నైకి తిరుగుతోంది. ఇక తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రష్మిక మందన్నా కొన్ని బూతులు కూడా మాట్లాడేసింది. నమస్తే ఎట్లా ఉన్నారు.. వచ్చేసెయ్.. మస్తుంది.. నీ యమ్మా.. ఏంది.. కొడదాం అంటూ ఏవేవో డైలాగులు చెప్పేసింది.
ఎవరి దగ్గరనో నేర్చుకున్నట్టు పాఠాలు చెప్పేసింది ఈ బ్యూటీ. ఆమె నోటి నుంచి ఇలాంటి బూతులు రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఇవి బూతులు అని తెలిసే మాట్లాడిందా లేక సరదాగా చెప్పిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనా రష్మిక ఇలా అంటుందని బహుషా ఎవరూ ఊహించలేదేమో.