Rashmika Mandanna Said About Her Lover : నేను లవ్ చేసింది అతన్నే.. పెళ్లి కూడా అయిపోయింది.. బాంబు పేల్చిన రష్మిక..!

NQ Staff - August 3, 2023 / 12:58 PM IST

Rashmika Mandanna Said About Her Lover : నేను లవ్ చేసింది అతన్నే.. పెళ్లి కూడా అయిపోయింది.. బాంబు పేల్చిన రష్మిక..!

Rashmika Mandanna Said About Her Lover :

రష్మిక మందన్నా ఎప్పటి నుంచో ఓ విషయాన్ని దాస్తూ వస్తోంది. అదేంటంటే.. ఆమె రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో లవ్ లో ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరూ రెండు సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ ఈ విషయాన్ని నేరుగా చెప్పట్లేదు. కానీ ఇద్దరూ తరచూ వెకేషన్లకు వెళ్తున్నారు.

మొన్ననే ఎవరికీ తెలియకుండా మాల్దీవులకు కూడా వెళ్లి వచ్చారు. కానీ ఆ విషయాన్ని దాచి పెట్టారు. అయితే తాజాగా రష్మిక మందన్నా చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తాను ప్రేమించింది ఎవరినో చెప్పేసింది. అంతే కాకుండా సీక్రెట్ గా పెళ్లి కూడా అయిపోయిందని షాక్ ఇచ్చింది.

తాజా ఈవెంట్ లో..

తాజాగా ఆమె ముంబైలో ఓ ఈవెంట్ లో పాల్గొంది. ఆమెను ప్రేమ గురించి ప్రశ్నించగా.. తాను ఆల్రెడీ నరుటోతో లవ్ లో ఉన్నట్టు తెలిపింది. నరుటో అంటే ఓ కామిక్ సిరీస్ క్యారెక్టర్. ఆ పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని… ఆ పాత్రతో నాకు పెళ్లి కూడా అయిపోయిందని చెప్పింది ఈ భామ.

అంటే తాను సింగిల్ గా ఉన్నానని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. కానీ ఆమె విజయ్ తో లవ్ లో ఉందనేది అందరికీ తెలిసిన నిజం. దాన్ని ఆమె ఇంకెన్ని రోజులు దాస్తుందో అని అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికైనా ఆ విషయాన్ని బయట పెట్టు అంటూ అడుగుతున్నారు. మరి ఈ ఇద్దరూ ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us