Rashmika: బాలీవుడ్ నీళ్లు బాగా ఒంట‌బ‌ట్టించుకున్నర‌ష్మిక‌.. తెగ ఆర‌బోస్తుందిగా..!

Rashmika: ఛ‌లో, గీతా గోవిందం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డికి అంద‌రి హీరోయిన్స్ మాదిరిగానే బాలీవుడ్ త‌లుపు త‌ట్టింది . ఇప్పటికే ఎంతోమంది అక్కడికి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొంత మంది సక్సెస్ అయ్యారు.. మరికొంతమంది ఫెయిల్యూర్స్ తో అక్కడే ఉండిపోయారు.. ఇంకొందరు మాత్రం వెళ్ళిన దారిలోనే మళ్ళీ సౌత్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ సినిమాలు చేసుకుంటున్నారు.

తాజాగా రష్మిక మందన ఒకేసారి రెండు హిందీ సినిమాలు ఒప్పుకుంది. అవి కూడా క్రేజీ ప్రాజెక్టులే. ఒక సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మరో సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ రెండు సినిమాల టైటిల్స్ మిషన్ మజ్ను.. గుడ్ బై. ప్రస్తుతం వీటి షూటింగ్ ముంబైలోనే జరుగుతున్నాయి. అందుకే పూర్తిగా అక్కడే మకాం మార్చేసింది రష్మిక మందన.

తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప, ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తుంది. ఇందులో పుష్ప మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసింది రష్మిక. మరోవైపు ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. దాంతో ముంబైలోనే కొన్ని రోజులుగా ఉండిపోయింది రష్మిక. బాలీవుడ్ హీరోయిన్ అయిన తర్వాత ఆమెలో చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు అభిమానులు.

మరీ ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా చాలా పద్ధతిగా రెడీ అయి వచ్చేది రష్మిక మందన. అదే బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత కేవలం నిక్కర్లలో దర్శనమిస్తుంది. ఎప్పటికప్పుడు కెమెరాల ముందు ఓ రేంజ్లో రెచ్చిపోతోంది. చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని అక్కడ హాట్ టాపిక్ అవుతుంది. ఈమె సెన్సేషనల్ క్లీవేజ్ షోలు ముంబై సర్కిల్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాయి.

రష్మిక తీరు చూస్తుంటే ఇక సౌత్ సినిమాకు బై చెప్పి అక్కడే సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే కన్నడ కస్తూరి దీపికా పదుకొనె, ఐశ్వర్యా రాయ్ లాంటి హీరోయిన్లు బాలీవుడ్ లో చక్రం తిప్పారు. ఇప్పుడు అదే కర్ణాటక నుంచి వెళ్లిన రష్మిక మందన అక్కడ అదే మ్యాజిక్ చేయాలని చూస్తుంది.