Rashmi : నందుని హత్తుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ గౌతమ్
NQ Staff - November 3, 2022 / 09:46 AM IST

Rashmi : నందు హీరో గా రష్మి గౌతమ్ హీరోయిన్ గా రూపొందిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
సినిమా రెండు సంవత్సరాలు పలు కారణాల వల్ల విడుదల వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకే సినిమా విడుదల కాబోతున్న నేపథ్యం లో హీరో నందు ఎమోషనల్ అయ్యాడు.
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని.. ముఖ్యంగా రష్మీ గౌతమ్ ఈ సినిమా కి చాలా సమయం కేటాయించిందని నందు కృతజ్ఞతలు తెలియజేసాడు. ఆ సమయం లో నందు కన్నీళ్లు పెట్టుకోగా హీరోయిన్ గా నటించిన రష్మీ గౌతం కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
స్టేజిపై నందుని హగ్ చేసుకుని మరీ రష్మి గౌతమ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీరిద్దరి ఇంతగా ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటో అనేది తెలియాల్సింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ ముఖ్య అతిథి గా హాజరు అవ్వడం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సుధీర్ మాట్లాడుతున్న సమయంలో జనాలు పెద్ద ఎత్తున అరుస్తూ అన్నా ఏయ్ అంటూ కామెంట్స్ చేశారు.