Rashmi Gautam : అందరి ముందే నోరు జారిన రష్మీ.. సీక్రెట్ లవ్ ఎఫైర్ ను బయట పెట్టిందిగా..!

NQ Staff - May 2, 2023 / 05:00 PM IST

Rashmi Gautam : అందరి ముందే నోరు జారిన రష్మీ.. సీక్రెట్ లవ్ ఎఫైర్ ను బయట పెట్టిందిగా..!

Rashmi Gautam : బుల్లితెరపై ఇప్పుడు రష్మీ హవా మామూలుగా లేదు. మల్లెమాల నుంచి సుధీర్, అనసూయ వెళ్లిపోయిన తర్వాత ఆమెకు తిరుగు లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు.

ఇందులో రష్మీ అందరి ముందే టంగ్ స్లిప్ అయిపోయింది. ఈ ఎసిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆసాంతం నవ్వులు పూయించింది. ఇందులో ఎక్కువగా రష్మీ హైలెట్ అయిపోయింది. అయితే ఎపిసోడ్ మధ్యలో ఓ టాస్క్ ను పెట్టారు. అది లక్ టెస్ట్. పాప్ కార్న్ బాక్స్ లో రాయి పడితే వారు అనుకున్నది జరుగుతుంది.

అయితే రష్మీ వంతు రాగానే ఆమె రాయి బాక్సులో పడితే లవ్ సక్సెస్ అవుతుందని లేకపోతే కాదని అంతా అనుకున్నారు. అయితే అందరూ ఊహించనట్టుగానే రష్మీ వేసిన రాయి బాక్సులో పడింది. దాంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమె నిజంగానే లవ్ లో ఉన్నట్టు ఎక్స్ ప్రెషన్లు ఇచ్చింది.

టీఆర్పీ రేటింగ్స్ కోసం అయితే అంత నేచురల్ ఎక్స్ ప్రెషన్లు రావు. పైగా రాయి పడగానే నా పొలంలో మొలకలొచ్చాయ్ అంటూ ఆమె గంతులేసింది. ఇది చూస్తే ఆమె నిజంగానే ఎవరితోనో లవ్ లో ఉందని అర్థం అవుతోందని అందరూ కామెంట్లు పెడుతున్నారు. మరి అతను ఎవరా అంటూ అందరూ ఆరా తీస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us