Rashmi Gautam : బాంబే బోర్డింగ్ పాస్ : తెలుగు బ్యూటీస్‌పై రష్మి సంచలన వ్యాఖ్యలు.!

NQ Staff - November 24, 2022 / 09:15 PM IST

Rashmi Gautam : బాంబే బోర్డింగ్ పాస్ : తెలుగు బ్యూటీస్‌పై రష్మి సంచలన వ్యాఖ్యలు.!

Rashmi Gautam : సోషల్ మీడియా వేదికగా అందాల భామల్ని ట్రోల్ చేయడమనేది ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. కొందరు చాలా స్ట్రాంగ్‌గా తమపై జరుగుతున్న ట్రోలింగ్ మీద స్పందిస్తుంటారు. కొందరు లైట్ తీసుకుంటుంటారు.

‘వీళ్ళు యాంమ్కర్స్ కాదు మావా.. హీరోయిన్స్ ఎలా అవ్వాలో తెలియక వుండి పోయిన హీరోయిన్స్‌ రా మావా..’ అంటూ ఓ మీమ్ పోస్ట్ చేశాడోనెటిజన్.. అందులో మంజూష, శ్రీముఖి, విష్ణుప్రియ, అషు రెడ్డి, రష్మి తదితరుల ఫొటోలున్నాయి

ముంబై భామలం అయి వుంటే..

ఈ మీమ్‌పై బుల్లితెర బ్యూటీ రష్మి గౌతమ్ తనదైన స్టయిల్లో స్పందించింది. ‘వెరీ ట్రూ అండీ.. ఇంకో కామన్ పాయింట్ మిస్ చేశారు. ఫొటోలో వున్న అమ్మాయిలు అందరూ తెలుగు ప్రాంతాల్లో పుట్టారు. బాంబే బోర్డింగ్ పాస్ వుంటే కథ వేరేగా వుండేదేమో. అప్పుడు మేం వేసుకునే బట్టలు కూడా ట్రెండ్ సెట్టింగ్‌గా వుండేదేమో..’ అంటూ రష్మి పేర్కొంది.

Rashmi Gautam Responded To Trolling

Rashmi Gautam Responded To Trolling

దీనిపై మళ్ళీ ట్రోలింగ్ కొనసాగుతోంది. ‘నీకసలు తెలుగు మాట్లాడటమే రాదు..’ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించడంతో, ‘మా అమ్మ ఒరిస్సా.. నాన్న యూపీ.. నేను సీబీఎస్ఈలో చదివాను.. తెలుగు మాట్లాడటం నాకు కష్టమే..’ అని రష్మి పేర్కొంది.

కాగా, అనసూయ, కల్పిక.. ఇలా చాలామంది తెలుగు భామలు తమపై జరుగుతున్న ట్రోలింగ్ మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించడమే కాదు, పోలీసులకూ ఫిర్యాదు చేస్తుంటారు.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us