Rashmi Gautam Posted Bold On Dating Culture : వావి వరసలు మరిచి సె** చేస్తున్నారు.. రష్మీ బోల్డ్ పోస్ట్ వైరల్..!
NQ Staff - July 30, 2023 / 10:56 AM IST

Rashmi Gautam Posted Bold On Dating Culture :
యాంకర్ రష్మీ అప్పుడప్పుడు చేసే పోస్టులు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఎక్కువగా ఆమె సమాజంలో మూగ జీవాలపై జరిగే దాడుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉంటుంది ఈ భామ. అప్పుడప్పుడు ఆమె చేసే కొన్ని పోస్టులు వివాదానికి కూడా దారి తీస్తూ ఉంటాయి.
అయితే తాజాగా రష్మీ మరో పోస్టు పెట్టింది. ఇందులో సెక్స్, అక్రమ సంబంధాలు, డేటింగ్ గురించి ఉంది. ఇప్పుడున్న జనరేషన్ లో డేటింగ్ సంప్రదాయం బాగా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయిత ఈ డేటింగ్ వల్ల మానవ సంబంధాలు ఎలా దెబ్బ తింటున్నాయో వివరించే ప్రయత్నం చేసింది రష్మీ.
డేటింగ్ కల్చర్ వల్ల..

Rashmi Gautam Posted Bold On Dating Culture
ఒకరి కంటే ఎక్కువ మందితో రిలేషన్ పెట్టుకోవడం వల్ల వావి వరసలు కూడా మర్చిపోతున్నారు అన్నట్టు అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉంది. ‘డేటింగ్ సంప్రదాయం వల్ల ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. సంబంధాలు, వావి వరసల గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ శృంగారాన్ని అనుభవించడంలో బిజీగా ఉన్నారు.
మంచి మార్గంలో నడవమని దేవుడు మనల్ని భూమి మీదకు పంపిస్తే.. మనం మాత్రం ఇలాంటి చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నాం అన్నట్టు రష్మీ పోస్టు ఉంది. రాక్షసత్వమైన శృంగార కోరికలతో ప్రేమని తిరస్కరిస్తున్నారు. విషపూరితమైన సంబంధాలు ఒక సైకిల్ లా మన చుట్టూ నెలకొన్నాయి అని ఆమె పోస్టులో ఉంది. అంటే ఇప్పుడు అందరూ ఎంచుకుంటున్న డేటింగ్ కల్చర్ ను ఆమె ఇలా ఖండిస్తోందన్నమాట.