Rashmi Gautam : అమ్మాయి ఇష్టంగా ఎవరితో వెళ్లినా తప్పులేదు.. రష్మీ దుమారం రేపే కామెంట్లు..!
NQ Staff - June 13, 2023 / 02:36 PM IST

Rashmi Gautam : యాంకర్ గా బుల్లితెరపై రష్మీకి మంచి ఇమేజ్ ఉంది. ఆమె ఎన్నో షోలలో పాల్గొంటుంది. అంతే కాకుండా అటు వెండితెరపై కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక కెరీర్ పరంగా మంచి పొజీషన్ లోనే ఉన్న ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటుంది. పైగా అనేక విషయాలపై స్పందిస్తూనే ఉంది.
మూగ జీవాలను హింసిస్తే.. అలాగే ఆడవారి హక్కుల గురించి తన వాదన వినిపిస్తూనే ఉంటుంది. పైగా ఎవరు తనకు కామెంట్ చేసినా సరే రిప్లై ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. ఇందులో ఓ నెటిజన్ దారుణమైన ప్రశ్న వేశాడు.
మీ దృష్టిలో అమ్మాయిలు ఒకరి కంటే ఎక్కువ మందితో డేటింగ్ చేస్తే ఎలా చూస్తారు అని అడిగారు. దానికి రష్మీ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. అందులో తప్పేముంది. దాన్ని నేను తప్పుగా భావించను. ఎందుకంటే అక్కడ ఆమెకు ఇష్టం లేకుండా ఏమీ జరగట్లేదు. ఆమె ఇష్టంతో ఎవరితో వెళ్లినా సరే అది ఆమె వ్యక్తిగత విషయం.
దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు. ఒకరి జీవితంలోకి మనం తొంగిచూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ అమ్మాయి అబ్బాయిలను డబ్బుల పేరుతో వాడుకుంటే అప్పుడు ఆమెది తప్పుగా భావించాలి. కానీ వారిద్దరూ అండర్ స్టాండింగ్ మీద కలిసి వెళ్లినప్పుడు మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.
అయితే రష్మిపై కొందరు ఫైర్ అవుతున్నారు. అమ్మాయి ఎంత మందితో తిరిగినా తప్పులేదని సమాజానికి మెసేజ్ ఇస్తున్నావా అంటూ అడుగుతున్నారు.