Rashi Khanna : రాశీ ఖన్నా రాశి మారిపోయింది.. ప్రస్తుతం తన టైమ్ ఎలా ఉందంటే?

Rashi Khanna : రాశీ ఖన్నా.. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందింది ఈ ముద్దు గుమ్మ. తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే.. బొద్దుగుమ్మలా ఇచ్చింది. ఆ తర్వాత తనకు బొద్దుగుమ్మలా ఉన్నందుకే అవకాశాలు వచ్చాయి. కానీ.. తర్వాత తను కష్టపడి.. జిమ్ కు వెళ్లి.. సన్నగా ముద్దుగుమ్మగా తయారైంది. ఇప్పుడు తను ఎంత సన్నగా అయిందంటే.. ఇండస్ట్రీలో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పటి రాశీకి ఇప్పటి రాశీకి చాలా తేడా ఉంది. తను ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తన టాలీవుడ్ సినిమా కెరీర్ లో రాశీ ఖన్నాకు చెప్పుకోదగ్గ హిట్లు బాగానే ఉన్నాయి కానీ.. ఈ మధ్య తను కొంచెం స్లో అయినట్టు అనిపించింది. కొన్ని రోజులు అవకాశాలు తన దగ్గరకు రాలేదు. అయినప్పటికీ.. తన పని తను చేసుకుంటూ వెళ్లింది. బ్యాడ్ టైమ్ నడుస్తుంది అని అనుకుందో ఏమో కానీ.. కొన్ని రోజులు రాశీ ఓపిక పట్టింది. ఇప్పుడు చూస్తే రాశీ ఖన్నా చేతిలో బోలెడు ఆఫర్లు.

rashi khanna has many projects in tollywood
rashi khanna has many projects in tollywood

ఒకటి కాదు రెండు కాదు.. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో 6 ఆఫర్లు ఉన్నాయట. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పటికీ.. మరోవైపు సినిమా షూటింగ్ లు లేనప్పటికీ.. రాశీ ఖన్నాకు మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి. తన రాశి మారిపోయినట్టుంది. ఇప్పుడు తనకు గుడ్ టైమ్ నడుస్తోంది. ట్రాక్ ఎక్కేసింది. రాశీ ఖన్నా.. మారుతి దర్శకత్వంలో ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే… విక్రమ్ కుమార్ కొండా దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్ ఇండస్ట్రీలో కార్తీతో ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే.. మరో సినిమా ప్రస్తుతం ట్రాక్ మీద ఉందట. ఇంకో సినిమా కథ వింటోందట. మొత్తం మీద రాశీ ఖన్నా దశ తిరిగిపోయింది. ఇక తను అస్సలు ఆగడం లేదు. తన గ్లామర్ డోస్ తో సినీ అభిమానులకు కవ్వింతలు పెట్టడానికి రెడీ అయిపోతోంది.