Deepika Padukone : భార్య దీపపికకి 119 కోట్ల రూపాయల విలువైన బహుమతి ఇస్తోన్న రణ్‌వీర్.!
NQ Staff - January 1, 2023 / 09:32 AM IST

Deepika Padukone : ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, తన భార్య దీపికా పడుకొనేకి ఓ ఖరీదైన బహుమతిని ఇవ్వబోతున్నాడుట. బహుమతి ఇప్పటికే సిద్ధమయ్యింది. దాని విలువ ఏకంగా 119 కోట్ల రూపాయలట. ఇప్పుడీ ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కొత్త సంవత్సర కానుకగా, ఆ బహుమతిని తానే స్వయంగా డిజైన్ చేయించాడట రణ్‌వీర్ సింగ్. అంతలా ఆ బహుమతిలో ప్రత్యేకత ఏంటా.? అని బాలీవుడ్ సినీ వర్గాలూ ఆరా తీస్తున్నాయి.
అత్యంత ఖరీదైన ఇల్లు…
ఒకటి కాదు రెండు కాదు.. పదీ కాదు, పాతికా కాదు.. యాభై కాదు.. డెబ్భయ్యీ కాదు.. ఏకంగా 119 కోట్ల రూపాయల విలువైన బహుమతి అది.
అంత ఖర్చు చేసి.. రణ్‌వీర్ సింగ్ ఇవ్వనున్న ఆ బహుమతి ఇంకోటేదో కాదు.. ఓ అందమైన ఇల్లు. ఆ ఇంటి డిజైన్ మొత్తం స్వయంగా రణ్‌వీర్ చేయించాడట. దీపిక ఇష్టాలకు అనుగుణంగా ఇంటీరియర్ అత్యంత లగ్జరియస్‌గా తీర్చిదిద్దారట.
కొత్త సంవత్సరంలో ఈ జంట ఆ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టనుంది.