Ranga Reddy: అసూయ‌తో మేన‌ల్లుడిని చంపిన అత్త‌

Ranga Reddy: రోజురోజుకు మ‌నుషుల‌లో రాక్ష‌స‌త్వం పెరిగిపోతుంది. ఇంట్లో వారిని, బ‌య‌ట వారిని కూడా న‌మ్మ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. కొంద‌రి క‌ర్క‌శ‌త్వం వ‌ల‌న అభం శుభం తెలియ‌ని చిన్నారులు మృత్యువాత‌ప‌డుతున్నారు. తాజాగా అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన చిన్నారి మేన‌త్త చేతిలో హ‌తమ‌య్యాడ‌ని తెలిసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

వివ‌రాలోకి వెళితే రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ల‌త‌,తిరుమ‌లేష్‌కు పెళ్లైన 12 ఏళ్ల‌కు బాబు జ‌న్మించాడు. ఆడ‌ప‌డుచుకు బిడ్డ పుట్టిన కార‌ణంతా త‌న‌ను అవ‌మానిస్తుంద‌ని కోపం పెంచుకున్న శ్వేత చిన్నారిపై విషం చిమ్మింది. పిల్లలు లేరని అవమానిస్తున్న వదినకు అదే శాస్తి జరగాలని.. అమ్మమ్మ దగ్గర నిద్రపోతున్న రెండు నెలల బాలుడ్ని తీసుకెళ్లి మేడపైన ఉన్న వాటర్ ట్యాంకులో పడేసి త‌న‌కేమి తెలియ‌న‌ట్టు న‌టించింది.

పోలీసులు త‌మదైన స్టైల్‌లో విచారించి అస‌లు విష‌యం రాబ‌ట్టారు. నిందితులు బాలుడి మేన‌త్త శ్వేత‌, మేన‌మామా రాజు అని నిర్ధారించారు . అయితే శ్వేత‌కు రెండేళ్లైన ఇంత వ‌ర‌కు పిల్ల‌లు పుట్ట‌లేదు. రెండు నెల‌ల క్రితం మూడ నెల గ‌ర్భంతో ఉండగా, అనారోగ్యం వ‌ల‌న శ్వేత‌కి గ‌ర్బ‌స్రావం అయింది. థైరాయిడ్ ఉన్న వాళ్ల‌కి పిల్ల‌లు పుట్ట‌ర‌ని ల‌త న‌వ్వుకుంటూ అనింద‌ట‌. దీంతో ఆమెకు కూడా క‌డుపుకోత ఎలా ఉంటుందో తెలియాల‌ని శ్వేత పని చేసింద‌ట‌.

శుక్ర‌వారం తెల్ల‌వారుఝూమున పిల్లాడ్ని మెల్ల‌గా బిల్డింగ్ పైకి తీసుకెళ్లి నోరు, ముక్కు మూసి చంపాల‌నుకుంది. కాని పిల్లాడు ఏడుస్తుండ‌డంతో భ‌య‌ప‌డ్డ శ్వేత ప‌క్క‌నే ఉన్న వాట‌ర్ ట్యాంక్‌లో వేసింది. పిల్లాడు చ‌నిపోయాడ‌ని అనుకున్న త‌ర్వాత త‌న‌కు ఏం పాపం ఎరుగ‌ద‌న్న‌ట్టు కింద‌కు వ‌చ్చి ప‌డుకుంది. తెల్లవారుజామున లేచేసరికి పక్కన ఉండాల్సిన బిడ్డ కనిపించకుండా పోయే సరికి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వచ్చి ఇంటి పరిసరాలు మొత్తం తనిఖీ చేశారు. వాటర్‌ ట్యాంకును ఓపెన్‌ చేసి చూసి షాక్ తిన్నారు. అందులోనే చిన్నారి డెడ్‌బాడీని చూసి బోరుమన్నారు. అయితే చిన్నారిది హ‌త్యే అని పోలీసులు భావించగా, ముందు ఇంట్లో వాళ్ల‌ని విచార‌ణ చేయ‌గా శ్వేత అస‌లు విష‌యం చెప్పింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి హత్యా కేసు నమోదు చేసి బాలుడి మేనమామ రాజుతోపాటు అతని భార్య శ్వేతను పోలీసులు అరెస్ట్ చేశారు.