సూపర్ నేచురల్ కథాంశంతో రానున్న రానా

Advertisement

కొత్త తరహా కథలను చెప్పడానికి ఇష్టపడే వాళ్లలో రానా దగ్గుబాటి ముందు వరసలో ఉంటారు. బాహుబలి లాంటి గొప్ప చిత్రం చేసిన తరువాత కూడా రానా బడ్జెట్ తో సంబంధం లేకుండా కొత్త తరహా కథలు చెప్తూ వచ్చారు. ఇప్పుడు రానా మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గృహం చిత్రంతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు మిళింద్‌ రావ్‌తో ఈ సినిమా చేయబోతున్నారు. దీన్ని ఆచంట గోపీ నాథ్‌తో కలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించబోతుంది.

ఈ మూవీ ఒక సూపర్ నేచురల్ యాక్షన్ అడ్వెంచర్ గా ఉండబోతోందని సమాచారం. గృహం మూవీ కూడా సూపర్ నేచురల్ అంశం చుట్టూ తిరిగే చిత్రం. ఈ మూవీలో గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం రానా కథానాయకుడిగా నటిస్తోన్న ‘విరాటపర్వం’ తుది దశ చిత్రీకరణలో ఉండగా.. ఇప్పటికే పూర్తయిన ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here