Rana Daggubati Comments On Star Heroine : ఆ హీరోయిన్ పై కోపంతో బాటిల్ పగలగొట్టా.. రానా సెన్సేషనల్..!

NQ Staff - August 14, 2023 / 12:11 PM IST

Rana Daggubati Comments On Star Heroine : ఆ హీరోయిన్ పై కోపంతో బాటిల్ పగలగొట్టా.. రానా సెన్సేషనల్..!

Rana Daggubati Comments On Star Heroine :

హీరోగా రానాకు మంచి గుర్తింపు ఉంది. ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగానే ఉంటారు. పైగా హీరోయిన్స్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. అలాంటి రానాకు ఓ హీరోయిన్ ను చూస్తే మాత్రం విపరీతమైన కోపం వచ్చిందంట. ఏకంగా తన చేతిలో ఉన్న బాటిల్ ను పగలగొట్టేశాడంట రానా.

అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోత’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ మూవీ ఆగష్టు 24న వస్తోంది. ఈవెంట్ లో రానా మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్ చాలా మంచి మనసున్న వ్యక్తి. దానికి ఓ ఉదాహరణ చెబుతాను. దుల్కర్ హిందీలో ఓ సినిమా చేశారు.

ఆ మూవీ ప్రొడ్యూసర్స్ నాకు స్నేహితులు కావడంతో షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్ కు వెళ్లాను. అందులో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తోంది. టేక్ జరిగేటప్పుడు ఆమె మధ్యలో తన భర్తతో ఫోన్ మాట్లాడుతుంది. అది ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా కాదు. ఆమె భర్త లండన్ లో షాపింగ్ చేస్తున్నాడంట. ఏం కొనాలో ఈమె చెబుతోంది.

ఆమె వెళ్లిపోయాక..

టేక్ జరిగేటప్పుడు డైలాగ్స్ కూడా సరిగ్గా చెప్పట్లేదు. టేక్స్ మీద టేక్స్ వేస్ట్ అవుతున్నాయి. కానీ దుల్కర్ మాత్రం ఆమెను ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. చూస్తున్న నాకే పిచ్చ కోపం వచ్చేసింది. చేతిలో ఉన్న బాటిల్ కూడా పగలగొట్టాను. ఆమె వెళ్లిపోయాక ప్రొడ్యూసర్స్ ను చెడామడా తిట్టేశాను.

Rana Daggubati Comments On Star Heroine

Rana Daggubati Comments On Star Heroine

కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఆమెను ఒక్క మాట కూడా అనలేదు. ఓపిగ్గా చేస్తున్నాడు. అది ఆయన వ్యక్తిత్వం అంటూ తెలిపాడు రానా. అయితే ఆ హీరోయిన్ ఎవరో మాత్రం చెప్పలేదు. ఆమె సోనమ్ కపూర్ అని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ చేసిన జోయా ఫ్యాక్టర్ అనే సినిమాలో ఆమె నటించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us