పుట్టినరోజు జరుపుకుంటున్న శివగామి
Admin - September 15, 2020 / 05:51 AM IST

తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న, ఎందరికో డ్రీమ్ గర్ల్ గా ఉన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. రమ్యకృష్ణ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. శ్రీదేవి తరువాత తెలుగు ఇండస్ట్రీలో అందంతో ప్రేక్షకులను మైమరిపియించిన నటి ఎవరైనా ఉన్నారంటే అది రమ్యకృష్ణే. కే రాఘ వేంద్రరావు మూవీస్ లో రమ్య కృష్ణ అందాలను చూడటానికి అప్పట్లో యువత పిచ్చెక్కిపోయేవారు. రమ్య గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేశారు.

1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రంద్వారా మంచినటిగా పేరు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. తరువాత రాఘవేంద్ర రావు చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చాయి. తరువాత అప్పట్లో ఉన్న అగ్ర హీరోలందరితో నటించింది. నరసింహ మూవీలో రమ్యకృష్ణ నటన ముందు రజినీకాంత్ కూడా తెలిపోయారు. బాహుబలి మూవీలో శివగామిగా తన నటనతో అందరికి ఆశ్చర్యపరిచింది. దర్శకుడు కృష్ణవంశీని రమ్య వివాహం చేసుకున్నారు.