Ramya krishna : రమ్యకృష్ణ కొడుకు ఇంత పెద్ద వాడు అయ్యాడా..సూపర్ ఉన్నాడు

krishna vamsi ramyakrishna

Ramya Krishna  : రమ్యకృష్ణ – కృష్ణ వంశీ వీరిద్దరి గురించి తెలియని వారు ఉండరు. రమ్యకృష్ణ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంటే, కృష్ణవంశీ ఒక క్రెయేటివ్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరికి సంతానంగా ఒక బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు ఆ బాబు కి పదహారు సంవత్సరాలు నిండాయి. ఇటీవలే వీరి కొడుకు రిత్విక్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా తమ కొడుకు పుట్టినరోజు సందర్బంగా దిగిన ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. ఆ ఫోటో లో చూసి చాలా పెద్దోడు అయిపోయాడని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. రమ్యకృష్ణ తన కొడుకుతో ఉన్న ఈ ఫోటోని అప్లోడ్ చేసిన కొద్దీ సేపటికే వైరల్ కావడం విశేషం.

ramya krishna and krishna vamsi son latest photos రమ్యకృష్ణ
ramya krishna and krishna vamsi son latest photos

ఇక రమ్యకృష్ణ విషయానికి వస్తే హీరోయిన్ గా అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత మదర్ గా, భార్య పాత్రల్లో నటించింది. అయితే రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ‘బాహుబలి’ సినిమాలలో రమ్యకృష్ణ ‘శివగామి’ పాత్రలో అద్భుతమైన నటన ని కనబరిచింది. అలాగే వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేసింది. తాజాగా జయలలిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించింది.

అలాగే క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించిన కృష్ణవంశీ మొదటగా ‘శివ’ సినిమాకి అసిస్టెంట్ గా పని చేసారు. ఇక అటు నుంచి దర్శకుడిగా మారిన కృష్ణవంశీ సిందూరం, గులాబీ, మురారి,ఖడ్గం,నిన్నే పెళ్లాడుతా, అంతఃపురం వంటి సూపర్ డూపర్ సినిమాలు చేసారు. తనలోని క్రియేటివిటీని సినిమాల రూపంలో తీయడం లో కృష్ణవంశీ విజయం సాధించారని చెప్పవచ్చు. అందుకే కృష్ణవంశీ సినిమా చేస్తున్నారంటే అభిమానుల అంచనాలు బాగా ఉంటాయి. కృష్ణ వంశీ చివరగా ‘నక్షత్రం’ అనే సినిమాతో వచ్చారు. ఆటు తర్వాత మరో సినిమాతో ముందుకు రాలేదు.కొత్త గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమాని ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాకి సంబందించి పనులతోనే కృష్ణవంశీ బిజీగా గడుపుతున్నారు.

Advertisement