CARONA: ర‌వితేజ ద‌ర్శ‌కుడికి క‌రోనా పాజిటివ్‌.. భ‌యాందోళ‌న‌లో ఖిలాడి చిత్ర బృందం

క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌ణుకు పుట్టిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌పై ప‌గ‌బ‌ట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు టాలీవుడ్‌ని వ‌ణికిస్తుంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రం అన్న‌ట్టు రోజుకు క‌నీసం ఒక్క సెల‌బ్రిటీ అయిన క‌రోనా బారిన ప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నివేదా థామ‌స్, అల్లు అర‌వింద్, దిల్ రాజు ఇలా పలువురు ప్ర‌ముఖులు ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ‌గా తాజాగా ఖిలాడి చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. కొద్దిగా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష చేయించుకున్న ర‌మేష్ వ‌ర్మ‌కు రిపోర్ట్‌లో క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

అంద‌రికి న‌మ‌స్కారం, నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. వెంట‌నే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాను. ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా పట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి. అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు వెళ్లొద్దు. మాస్క్‌లు ధ‌రించండి, జాగ్ర‌త్త‌గా ఉండండి అని ర‌మేష్ వ‌ర్మ పేర్కొంది. ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ఖిలాడి అనే సినిమా తెర‌కెక్కిస్తుండ‌గా, ఆయ‌న క‌రోనా బారిన ప‌డ‌డం చిత్ర బృందానికి ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావించారు. కాని ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల‌న రెగ్యుల‌ర్‌గా షూటింగ్ జ‌రిపే ప‌రిస్థితి లేక‌పోవ‌డం మ‌రో వైపు ద‌ర్శ‌కుడికి క‌రోనా సోక‌డం రిలీజ్ డేట్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఖిలాడి చిత్రాన్ని డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. క్రాక్‌తో మంచి హిట్ కొట్టిన ర‌వితేజ ఖిలాడిగాను అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని ప్రేక్ష‌కులు విశ్వ‌సిస్తున్నారు.

Advertisement