Sukumar : సుకుమార్‌ మెగా హీరోలని ఇప్పట్లో వదిలేలా లేడుగా.. వరసగా బన్నీ, చరణ్‌ని తెగ వాడేస్తున్నాడు.

NQ Staff - November 3, 2022 / 07:31 PM IST

Sukumar : సుకుమార్‌ మెగా హీరోలని ఇప్పట్లో వదిలేలా లేడుగా.. వరసగా బన్నీ, చరణ్‌ని తెగ వాడేస్తున్నాడు.

Sukumar : లెక్కల మాష్టారుగానే కాదు.. స్టార్‌ కాస్టింగ్‌ లోనూ, కథల ఎంపికలోనూ దర్శకుడిగా పక్కా లెక్కలేసుకోవడంలో సుకుమార్ తోపే. బడా హీరోల క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటూనే తనదైన స్టయిల్‌లో వెండితెరపై కథ చెప్పడంలో దాదాపు సక్సెసవుతూనే ఉంటాడు.

మొదటి చిత్రంగా మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్‌ తో ఆర్యని తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్‌ సాధించాడు. ఆ తర్వాత బన్నీతో బాండింగ్ కంటిన్యూ అవుతూ ఆర్య టూ కూడా డైరెక్ట్‌ చేశాడు. ఇక వీళ్ల కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఏ రేంజ్‌ హిట్టయ్యిందో అందరికి తెలిసిందే.

ఆ మూవీ రిలీజైన అన్ని భాషల్లోనూ సూపర్‌ సక్సెస్‌ సాధించడంతో పుష్ప టూ పై భారీ హైప్‌ క్రియేటయింది. ఆ సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తిస్థాయిలో స్టార్ట్ కాకముందే సుక్కు తర్వాతి మూవీ గురించిన ఓ న్యూస్‌ టాక్‌ ఆఫ్ టాలీవుడ్‌ గా మారింది. త్రిబులార్ కోసం రామ్ చరణ్ బాడీ బిల్డ్ చేయడంతో తన అప్‌ కమింగ్ ప్రాజెక్ట్ లో ఆ ఫిజిక్ తో ఇంట్రో షాట్స్‌ కావాలని సుకుమార్‌ ఆల్రెడీ ఆ లుక్‌ లో ఉండే సీన్స్‌ షూట్ చేసేసుకున్నాడట. క్లబ్ హౌజ్‌ లో చిట్ చాట్ లో భాగంగా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిఐల్‌ ఈ మ్యాటర్‌ ని రివీల్ చేశాడు.

అంటే ఈ లెక్కన చరణ్‌తో సుకుమార్‌ మరోసినిమా పక్కా కన్‌ఫామే అంటూ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. రంగస్థలంతో నటుడిగా చరణ్‌ ని మరో మెట్టెక్కించాడు సుకుమార్‌. ఆ తర్వాతే బన్నీతో పుష్ప ప్రాజెక్ట్‌ స్టార్ట్ చేశాడు. తన కెరీర్లో చేసినవి(పుష్ప టూ తో కలిపి) తొమ్మిది చిత్రాలయితే అందులో అయిదు చిత్రాలు మెగా ఫ్యామిలీ హీరోలే కావడం విశేషం. ఇక ఇప్పుడు పదో సినిమాలో కూడా మెగా హీరోనే అని తేలడంతో అభిమానులు సంబర పడిపోతున్నారు.

పుష్ప టూ పూర్తవ్వక ముందే చరణ్‌ తో ఇంట్రో సీన్స్‌ తీసుకున్నాడు కాబట్టి తనదైన స్టయిల్‌ లో స్క్రిప్ట్‌ అండ్ స్క్రీన్‌ ప్లే కూడా లాకయిపోయినట్టే. సో అన్నీ కుదిరి సెట్స్‌ పైకెళ్తే త్వరగానే షూట్‌ కూడా కంప్లీటయిపోతుందన్న ఆశతో ఉన్నారు హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్. ఇక రామ్‌చరణ్‌ కూడా శంకర్‌ ప్రాజెక్ట్‌ తో బిజీగా ఉండడం, ఇటు సుక్కు కూడా పుష్ప టూ డైరెక్ట్ చేస్తుండడం వల్ల, వన్స్‌ ఇద్దరి సినిమాలు పూర్తయితే వెంటనే అప్‌ కమింగ్‌ మూవీ సెట్స్‌ పైకెళ్లే ఛాన్సులున్నాయి.

అటు శంకర్‌ డైరెక్షన్లో చరణ్‌ సినిమా, ఇటు పుష్ప సీక్వెల్‌మూవీ రెండింటికీ హిట్స్‌ కి స్కోప్ ఎక్కువగానే ఉంది. సో.. ఆటోమేటిక్ గా వీళ్ల కాంబినేషన్లో రాబోయే చిత్రానికి కూడా భారీ హైపే క్రియేటవుతుంది.

మరి ముందునుంచే పెరుగుతున్న అంచనాలను అందుకునేలా సుకుమార్‌ తన డైరెక్షన్‌ బ్రిలియన్స్‌ ని ఏ రేంజ్‌లో చూయిస్తాడో? రంగస్థలం లాంటి పీరియాడికల్ స్టోరీతో బాక్సాఫీస్‌ ని షేక్‌ చేసిన సుక్కు అండ్ చరణ్‌ ఈసారి ఎలాంటి కథతో, ఏ రేంజ్‌ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ తో ప్రేక్షకుల ముందుకొస్తారో చూడాలి మరి.

మొత్తానికయితే పెరుగుతున్న తన గ్రాఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తూనే వరుసగా చరణ్‌, బన్నీలతో సినిమాలు ప్లాన్‌ చేస్తుండడంతో ఇప్పట్లో సుకుమార్‌ మెగా హీరోలని వదిలేలా లేడుగా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us