ఆచార్యలో నటించనున్న రాం చరణ్, కన్ఫర్మ్ చేసిన చరణ్

Advertisement

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో తాను కూడా నటిస్తున్నానని హీరో రాం చరణ్ ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. చరణ్ చెప్పిన ఈ విషయంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాను, తన తండ్రి కలిసి నటించడం తన తల్లి సురేఖ కోరికని చరణ్ తెలిపారు. గతంలో చిరు కోరిక కోసం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించిన చరణ్ ఇప్పుడు తల్లి కోరికను నెరవేర్చడానికి ఆచార్య మూవీలో నటిస్తున్నారు.

ఇప్పటికే చిరు రాం చరణ్ పలు మూవీస్ లో కలిసి కనువిందు చేశారు. కానీ అవన్నీ కేవలం గెస్ట్ పాత్రలే. మగధీర, బ్రూస్ లీ మూవీస్ లలో చిరు గెస్ట్ పాత్రలో కనిపించగా, ఖైదీ 150లో చరణ్ ఒక పాటలో కనిపించి ప్రేక్షకులకు సంతోషాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆచార్యలో ఒక 30నిమిషాలు నిడివి ఉన్న పాత్రలో చరణ్ నటించనున్నారు. మొదట ఈ పాత్రలో మహేష్ బాబు నటించడానికి ఒప్పుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారని సమాచారం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here