Actress Rambha Has Crush On Prabhas : భర్తకు విడాకులిచ్చైనా ప్రభాస్ తో ఆ పని చేస్తా.. రంభ షాకింగ్ కామెంట్లు..!

NQ Staff - June 26, 2023 / 12:39 PM IST

Actress Rambha Has Crush On Prabhas : భర్తకు విడాకులిచ్చైనా ప్రభాస్ తో ఆ పని చేస్తా.. రంభ షాకింగ్ కామెంట్లు..!

Actress Rambha Has Crush On Prabhas : ప్రభాస్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఊపేస్తున్నాడు మన డార్లింగ్. ఆయనకు కేవలం అమ్మాయిల్లోనే కాదు.. హీరోయిన్లలో కూడా పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఆయనతో కలిసి ఒక్క సారైనా నటించాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు.

కాగా తాజాగా ఈ లిస్టులోకి రంభ కూడా వచ్చేసింది. ఆమె గతంలో హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. తన అందాలతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. అంతటి అందాలు కేవలం ఆమెకే సొంతం. అయితే రంభ కేవలం తెలుగులోనే కాకుండా భోజ్ పురిలో కూడా ఎన్నో సినిమాలు చేసింది.

కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె ఎన్నారైని పెండ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ప్రస్తుతం అమెరికాలోనే ఉంటుంది. అయితే రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నాకు జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రభాస్ అంటే నాకు క్రష్‌ ఉంది.

ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఆ ఛాన్స్ గనక వస్తే నా భర్తతో గొడవ పెట్టుకుని మరీ సినిమా చేస్తా. ఒప్పుకోకపోతే విడాకులు ఇచ్చైనా ఆ పని చేస్తా అంటూ సరదాగా చెప్పింది ఈ భామ. మరి ఆమెకు ప్రభాస్ అలాంటి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us