Ramakrishna: నా భార్య‌ను ఎలా పంప‌గ‌ల‌ను.. అందుకే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాన్న రామ‌కృష్ణ‌

Ramakrishna: పాత పాల్వంచ తూర్పు బజారులో నివాసం ఉండే రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి దంపతులతో పాటు కవలలు సాహిత్య, సాహితిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అంద‌రు క‌న్నుమూసారు. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఈ లేఖలో తన చావుకు తన తల్లి, సోదరి తో పాటు ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్ర కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు.

ramakrishna and family are sucide1
ramakrishna and family are sucide1

నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకోవడం.. అది బయటకు రావడం.. దానిలోని తమ ఫ్యామిలీ ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని.. రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి.. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు.. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని.. కానీ, ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు.. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగాడు.. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు.

నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను అంటూ వీడియోలో అన్ని చెప్పుకొచ్చారు రామకృష్ణ. నా భార్యను పంపిస్తే ఆస్తి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు… నా భార్య నాకోసం వచ్చింది.. ఆమెకు ఎన్నో హామీలు ఇచ్చి వచ్చాను.. నేను ఒక్కడిని ఆత్మహత్య చేసుకుంటే.. నా భార్యను ఏమైనా చేస్తారు. నా పిల్లలు అన్యాయం అవుతారు. నా భార్యకు ఈ విషయం తెలియదు. నేను చేసేది తప్పు అని తెలిసినా ఇంకా ఎవ్వరికీ అన్యాయం జరగొద్దని ఈ నిర్ణయం తీసుకుంటున్నానని వీడియోలో చెప్పారు రామకృష్ణ.

12 సంవత్సరాల మా సంసార జీవితంలో ఏ రోజు ఏ పొరపొచ్చాలు లేకుండా చేసుకున్నాను.. అన్ని రకాల హామీలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. ఏ రకంగా నేను పంపించగలను.. కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నాను. దయ చేసి నా ఈనిర్ణయాన్ని తప్పు పట్టకండి.. నా జీవితం కూడ ఎలా అయినా పరువాలేదు.. నా ఆర్ధిక సహాయం చేసిన వారిని నష్టం జరుగకుండా నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని నాకు సహకరించిన వారందరికి అప్పు తీర్చాలని కోరాడు.

ramakrishna and family are sucide
ramakrishna and family are sucide

కానీ, ఇలాంటి దుర్మార్గులను మాత్రం ఎదగనివ్వకండి. ఈ మధ్య కాలంలో ఒక‌రు రాఘవ పేరు పెట్టి చనిపోయాడు. నెల రోజులు రాఘవ దాక్కొని బెయిల్ తెచ్చుకుని వచ్చాడు. ఎక్కడో దాక్కోని వచ్చాడు.. ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ ప్రారంభించాడు.. ఇలాంటి వ్యక్తి వల్ల లోకంలో ఎవరు బతుకుతారు.. సామాన్యులు ఎలా బతుకుతారు? తట్టుకుని ఎలా నిలబడగలరు.. ? అని గోడు వెల్లవేసుకున్నారు రామకృష్ణ.. ఇప్పుడు ఆయ‌న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.