Rama Prabha : నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు.. రూ.60 కోట్ల ఆస్తిపై రమాప్రభ క్లారిటీ..!
NQ Staff - June 3, 2023 / 02:58 PM IST

Rama Prabha : రీసెంట్ గా సీనియర్ నటుడు శరత్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మాజీ భార్య రమాప్రభ పేరు సోషల్ మీడియలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎందుకంటే గతంలో రమాప్రభను శరత్ బాబు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కనీసం ఏడాది కూడా కలిసి ఉండక ముందే ఇద్దరూ విడిపోయారు.
అప్పటి నుంచి ఎవరి జీవితాలు వారు చూసుకుంటున్నారు. అయితే రమాప్రభతో విడిపోయిన తర్వాత శరత్ బాబు వేరే వివాహం చేసుకున్నారు. కానీ ఆయనకు సంతానం మాత్రం కలగలేదు. అయితే శరత్ బాబు చనిపోక ముందే రమాప్రభకు రూ.60 కోట్ల ఆస్తి ఇచ్చినట్టు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు.
ఇదే విషయాన్ని ఆయన చనిపోయిన తర్వాత కొందరు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వైరల్ అవుతున్న వార్తలపై తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించింది రమాప్రభ. ఆమె మాట్లాడుతూ.. కొందరు నాపై ఏవేవో సృష్టిస్తున్నారు. నిజాలు తెలుసుకోండి. ఆయనకు చెన్నైలో ఒక ఇల్లు మాత్రమే ఉంది.
కానీ అందులో ఎవరెవరో ఉంటున్నారు. ఇప్పటికీ నాకు సొంత ఇల్లు, కారు లాంటివి ఏమీ లేవు. సింపుల్ గానే బతుకుతున్నాను. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతలో ప్రశాంతంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది రమాప్రభ. అంటే ఇన్ డైరెక్టుగా తనకు శరత్ బాబు ఎలాంటి ఆస్తి ఇవ్వలేదని తెలిపిందన్నమాట.