అవసరమైతే రామ్ పోతినేని కి కూడా నోటీసులు ఇస్తాం : ఏసీపీ

Advertisement

విజయవాడలో రమేష్ ఆసుపత్రి మేనేజిమెంట్ క్వారంటైన్ గా నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదానికి గురి అయిన విషయం తెలిసిందే. తాజాగా విజయవాడ రమేష్ ఆస్పత్రి అగ్ని ప్రమాదంపై ఏసీపీ సూర్యచంద్రరావు మీడియాతో మాట్లాడారు. అయితే ఇప్పటికే ఈ కేసు విషయంలో డాక్టర్ మమత, సౌజన్యలను విచారణ జరిపినామని అన్నారు. రమేష్ చౌదరి అల్లుడు కల్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు హాజరవాల్సి ఉందని అన్నాడు. కానీ తన అనారోగ్య కారణాల వల్ల రెండువారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ ఆసుపత్రి వ్యవహారంలో ఎవ్వరికి విచారణ నుండి మినహాయింపు ఇవ్వమని స్పష్టం చేసారు. వయోవృద్దులకు తప్ప మిగతా వారందరినీ కూడా విచారణ జరుపుతామని తెలిపాడు. వృద్ధులను మాత్రం స్వయంగా తమ దగ్గరికి వెళ్లి విచారణ జరుపుతామని అన్నాడు. ఈ విచారణకు ఆటకం కలిగించాలని చూస్తే నటుడు రామ్ పోతినేనికి కూడా నోటీసులు పంపిస్తామని అన్నారు. అయితే ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు వెల్లడించారు. త్వరలో అన్ని బయట పెడుతామని ఏసీపీ సూర్యచంద్ర రావు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here