Ram Pothineni : టాలీవుడ్ లో ఆ హీరోనే నెంబర్ వన్.. హీరో రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

NQ Staff - June 14, 2023 / 02:47 PM IST

Ram Pothineni : టాలీవుడ్ లో ఆ హీరోనే నెంబర్ వన్.. హీరో రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ram Pothineni : టాలీవుడ్ లో హీరోల నడుమ పోటీ వాతావరణం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ అందరు హీరోలు నెంబర్ వన్ కాలేరు. కానీ ఇప్పుడు తెలుగులో ఆరుగురు స్టార్ హీరోల నడుమ పోటీ వాతావరణం బాగా ఉంది. ఈ ఆరుగురు పాన్ ఇండియా క్రేజ్ కోసం బాగానే కష్టపడుతున్నారు. ఒకరిని మించి మరొకరి సినిమాలు ఆడుతున్నాయి.

దాంతో అసలు ఏ హీరో నెంబర్ వన్ అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరూ తేల్చలేకపోయారు. అయితే హీరో రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన అనేక విషయాలపై ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు కానీ హీరో ప్రభాస్ ఫొటోను చూపించి ఆయన గురించి ఒక మాట చెప్పమని యాంకర్ కోరింది.

దానికి రామ్ స్పందిస్తూ.. బాక్సాఫీస్ కా బాప్.. నెంబర్ వన్ అని చెప్పాడు. అంటే టాలీవుడ్ లో నెంబర్ హీరో అంటే కేవలం ప్రభాస్ మాత్రమే అని రామ్ ఉద్దేశం అన్నమాట. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ram Pothineni Said No.1 Hero Prabhas In Tollywood

Ram Pothineni Said No.1 Hero Prabhas In Tollywood

హీరో రామ్ కు థాంక్స్ చెబుతున్నారు. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు ఆదిపురుష్ సినిమాతో రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు సినిమాలతో ప్లాపులు చూసిన ఆయన.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us