రామ మందిర భూమి పూజలో ప్రధానితో వేదిక పంచుకున్న వ్యక్తికి కరోనా

Advertisement

అయోధ్య: ఈనెల 5న జరిగిన రామ మందిర భూమి పూజకు హాజరైన రామ మందిర ట్రస్ట్ సారథి నృత్య గోపాల్ కరోనా భారిన పడ్డారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలు ఏర్పడటంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అయితే ఈయన మొన్న జరిగిన రామ మందిర భూమి పూజలో పాల్గొన్నారు. అలాగే ప్రధాని మోడీతో వేదిక పంచుకున్నారు.

రామ మందిర భూమి పూజలో వేదికలో మోడీతో పాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌ వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందే, మందిర పూజారి ప్రదీప్‌దాస్‌తో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. నృత్య గోపాల్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో వేదిక పంచుకున్న నాయకులు కూడా కరోనా పరీక్షలకు చేయించుకోవడానికే సిద్ధపడుతున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here