పవర్ స్టార్ సినిమా రివ్యూ

Advertisement

విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా పవర్ స్టార్. ఈ సినిమా మొదలు పెట్టిన నుండి వివాదల్లో చిక్కుకుంటున్నారు వర్మ. మొత్తానికి ఈ సినిమాను శనివారం తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేసాడు. అయితే ఈ సినిమా రివ్యూ లోకి వెళితే… పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సంఘటనలు అంటూ దాదాపుగా పవన్ తో పాటు ఆరుగురిపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టి.. నలభై నిమిషాల పాటు ఈ సినిమా ను తీసాడు. అందరినీ అత్యంతగా ఆకర్షించిన ఈ సినిమా కోసం వదిలిన ట్రైలర్ లో చూపించిన కంటెంట్ కి కాస్త ముందు వెనుక ల్యాగింగ్ సన్నివేశాల్ని అతికించి సినిమా రిలీస్ చేసాడు వర్మ.

మొదటి సగ భాగంలో పూర్తిగా ట్రైలర్ లో ఉన్న అంశాలే ఉన్నాయి. తరువాతి సగ భాగంలో మాత్రం ఆర్జీవీ తన స్టైల్ కి భిన్నంగా సినిమా ను నడిపించారు. ఇక క్లైమాక్స్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. పవన్ అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికే అనే విధంగా క్లైమాక్స్ మొత్తం కూడా నడిచింది. వోడ్కా బాటిల్ తో ప్రవన్ కళ్యాణ్ అనే పవర్ స్టార్ ముందు కూర్చొని.. తనని తాను పవన్ ఫ్యాన్ గా చెప్పుకోవడానికి విపరీతంగా తాపత్రయ పడ్డారు వర్మ.

అంతే కాకుండా మీరు పార్టీ పెడతానన్నప్పుడు మీ ఫ్యాన్స్ కంటే నేనే ఎక్కువ హ్యాపీ గా ఫీల్ అయ్యానని.. ఎందుకంటే మీలో ఉన్న సిన్సియారిటీని నేను బాగా ఇష్టపడతానని అన్నాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ మనదేశంలో ఉన్న నాయకుల్లో మీరు చాలా గొప్పవారు అని ఖచ్చితమైన నమ్మకం. ఎందుకంటే మీ గురించి మొత్తం చదివాను. అలాగే ఫాలో కూడా అయ్యాను. మీ మొదటి సినిమా చేసినప్పటి నుండి మీరు ఎన్నుకున్న కథలు కాని.. చేసిన కథలు కాని… వీటన్నింటినీ పరిశీలించి ఇది చెప్తున్నా.. నాకు పిచ్చెక్కి మతి చెడిపోయి ఇది తీయలేదు. నా ఓడ్కా మందు మీద ఒట్టేసి చెప్పున్నా.. నాయకులందరికంటే మీరు చాలా గొప్పవారు.” అంటూ క్లైమాక్స్ ముగిసింది. మొత్తానికి పవన్ అభిమానులకు షాక్ ఇచ్చాడు వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here