Ram Gopal Varma : శ్రీదేవి కోసం నిన్ను చంపేస్తా.. రాఘవేంద్రరావుకు ఆర్జీవీ వార్నింగ్..!

NQ Staff - April 24, 2023 / 11:50 AM IST

Ram Gopal Varma : శ్రీదేవి కోసం నిన్ను చంపేస్తా.. రాఘవేంద్రరావుకు ఆర్జీవీ వార్నింగ్..!

Ram Gopal Varma : అప్పట్లో కుర్రాళ్ల కలల రాకుమారి శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సామాన్య జనాలే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా శ్రీదేవి అంటే పడి చచ్చిపోయేవారు. అప్పట్లో ఆర్జీవీ ఆమెకు పెద్ద అభిమానిగా ఉండేవారు. అయితే ఓ సమయంలో శ్రీదేవి కోసం ఆర్జీవీ రాఘవేంద్రరావకు వార్నింగ్ ఇచ్చాడు.

అప్పట్లో శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆమెతో పాటు ఆర్జీవీ, రాఘవేంద్రరావు పాల్గొన్నారు. రాఘవేంద్రరావు తండ్రి సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో కూడా శ్రీదేవి పని చేసింది. ఆ విషయాలను ఈ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. తన తండ్రి లేనప్పుడు రాఘవేంద్రరావు కొన్ని సీన్లను డైరెక్ట్ చేసేవారు.

Ram Gopal Varma Warned K Raghavendra Rao For Sridevi

Ram Gopal Varma Warned K Raghavendra Rao For Sridevi

చెన్నైలో ఓ రోడ్డుపై పరుగెత్తే సీన్ ను రాఘవేంద్రరావు చేశారు. అప్పుడు శ్రీదేవి చిన్నపిల్ల కావడంతో ఆయన ఏం చెప్పినా చేసేది. రోడ్డుపై పరుగెత్తింది. కానీ ఓ కారు వేగంగా రావడంతో ఆమెకు కొంచెంలో ప్రమాదం తప్పింది. ఆమె కాలు మడమకు దెబ్బ తాకింది. కొంచెంలో ప్రాణాలు పోయేవి అని ఈ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

దాంతో వెంటనే రియాక్ట్ అయిన వర్మ.. అదే జరిగితే నేను మిమ్మల్ని చంపేసేవాడిని అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇంటర్వ్యూలో అందరూ నవ్వేసుకున్నారు. ఇక ఆర్జీవీ దర్శకత్వంలో శ్రీదేవి క్షణక్షణం సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి హిట్ అయింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us