Ram Gopal Varma : కమ్మోళ్ళకి కంగ్రాట్స్ చెప్పిన రామ్ గోపాల్ వర్మ.!
NQ Staff - January 9, 2023 / 10:23 AM IST

Ram Gopal Varma : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అంటే వివాదాస్పద ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మకి అస్సలు గిట్టదు. అందుకే, ఆ మధ్య పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఓ పేరడీ సినిమా కూడా తీశాడాయన.
తాజాగా, రామ్ గోపాల్ వర్మ ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయాడు.
పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలకు దిగాడు. ఈ వ్యవహారమిప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. బహుశా రామ్ గోపాల్ వర్మ వైసీపీలో చేరిపోయి వుంటాడనే అంతా అనుకునే పరిస్థితి వచ్చింది.
డబ్బు కోసం అమ్మేస్తాడని ఊహించలేదు..
‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. ‘రిప్’ (రెస్ట్ ఇన్ పీస్) కాపులు, కంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్ళు..’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీటేశాడు.
చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీటేశాడు. చంద్రబాబు దగ్గరకి పవన్ కళ్యాణ్ వెళ్ళారు కాబట్టి, కాపుల్ని పవన్ కళ్యాణ్, కమ్మోడైన చంద్రబాబుకి అమ్మేసినట్లు అన్నమాట.. అదీ రామ్ గోపాల్ వర్మ ఉద్దేశ్యం.
మరి, కొన్నాళ్ళ క్రితం కమ్మవాడైన చంద్రబాబు, కాపు వాడైన పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళారు కదా.! అప్పుడు కమ్మోళ్ళని, కేవలం డబ్బు కోసం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి అమ్మేసినట్లా.? అప్పుడు కాపులకెందుకు రామ్ గోపాల్ వర్మ కంగ్రాట్స్ చెప్పలేదో.!
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు ???
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023