PM Modi : మోడీ ‘శవాల వ్యాపారి’ అంటే ఏంటో అనుకున్నా.. ఇప్పుడు నమ్ముతున్నా..

PM Modi: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత రెండు మూడు రోజులుగా ప్రధాని మోడీపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. కరోనా మరణాలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఘాటుగా స్పందిస్తున్న ఆయన పీఎంని లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పారేస్తున్నారు. ఎలక్షన్ ప్రచారంలో నిన్నటి దాకా మమతా బెనర్జీ ఖేల్ ఖతం అంటూ వార్నింగులు ఇచ్చిన ప్రధాని ఇప్పుడేమంటారు? అని రాంగోపాల్ వర్మ నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో కంటిన్యూగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. పీఎం నరేంద్ర మోడీని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కన్నా రాంగోపాల్ వర్మే ఎక్కువగా, కరెక్టుగా నిలదీస్తున్నట్లు వీటిని బట్టి అర్థమవుతోంది.

RGV Satires On PM Modi

సోనియాజీ.. మీ కాళ్లు మొక్కుతా..

‘‘నరేంద్ర మోడీ ‘శవాల వ్యాపారి’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏడేళ్ల కిందటే (2014లోనే) విమర్శించారు. కానీ నేను అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నా. ప్రధానిగా ఉండి ఆయన కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోవటంతో దేశంలో ఎక్కడ చూసినా డెడ్ బాడీల దహనాలు, అంత్య క్రియల కోసం ఎదురుచూస్తున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి’’ అని రాంగోపాల్ వర్మ ఎద్దేవా చేశారు. సోనియాజీ మీరు ఇంత ముందు ప్రదర్శిస్తారని నేను ఆనాడు ఊహించలేదు. క్షమించండి. వీలైతే మీ పాదాల ఫొటోని షేర్ చేయండి. ఆన్ లైన్ లోనే మొక్కుతా అంటూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లతో ఫుల్లు కౌంటర్లు వేశారు. ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో ఎక్కువగా ప్రస్తావించే ‘మేరే దేశ్ వాసియో’’ అనే పదాన్ని కూడా వర్మ ప్రత్యేకంగా, వెటకారంగా పేర్కొన్నారు.

RGV Satires On PM Modi

గొప్పలు చెప్పుకోవటం కాదు..

ఇతర దేశాలకి సహాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం కాదు సార్.. మనకి అంతకన్నా ఎక్కువ సాయం అవసరం అవుతుందని గ్రహించకపోవటం, ముందుచూపు ప్రదర్శించలేకపోవటం గురించే ఇప్పుడు చర్చ. అవసరమైనప్పుడు విదేశాల సాయం తీసుకోవటంలో తప్పులేదు. కానీ ఆ సందర్భంలో ఆత్మనిర్భర్ ఏమైంది అనేదే ముఖ్యం. ఏది ఏమైనప్పటికీ కొవిడ్-19 వైరస్ ని కంట్రోల్ చేయలేక మీరు చేతులెత్తేయటం వల్ల దేశంలో వల్లకాళ్లు ఎలా నిర్విరామంగా వెలిగిపోతున్నాయో చూడండి. ఇంతటి అద్భుతమైన హారర్ విజువల్స్ ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మోడీ సార్ అంటూ రాంగోపాల్ వర్మ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. కరోనాతో చనిపోయినవారి దహనాల ఫొటోలను తన పోస్టుకి జత చేశారు.

Advertisement