Pawan Kalyan: కరోనా సోకిన పవన్ కళ్యాణ్ పై.. రాంగోపాల్ వర్మ సెటైర్లు.. ‘వకీల్ సాబ్’నీ వదల్లే..

Pawan Kalyan జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ సోకి, హాస్పిటల్ లో చేరి, ట్రీట్మెంట్ పొందుతుంటే అదసలు సీరియస్ ఇష్యూనే కాదన్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహరించారు. చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ఫొటో నిన్న శుక్రవారం సోషల్, రెగ్యులర్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దానిపై రాంగోపాల్ వర్మ నిన్న సాయంత్రం నుంచే సెటైర్లు మొదలుపెట్టారు. ట్విట్టర్ లో మొత్తం 6 పోస్టులు పెట్టారు. ‘వకీల్ సాబ్’ మూవీ పైనా వంకర టింకర కామెంట్లు చేశారు. ఈ విషయం ఇవాళ శనివారం పొద్దున వెలుగు చూసింది.

ఏమన్నారంటే..

పవన్ కళ్యాణ్ ఓ బెడ్డు మీద పడుకొని ఏదో లిక్విడ్ ఎక్కించుకుంటున్న ఫొటో పైన రాంగోపాల్ వర్మ ‘‘హే పీకే ఫ్యాన్స్, ఆ వైరస్ లని పచ్చడి చేసి చంపేయండి’’ అని సూచిస్తూ రైటప్ రాశారు. తర్వాత రెండో పోస్టులో.. ‘‘ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కళ్యాణ్ ని ఇలాంటి దయనీయమైన స్థితిలో పడుకోబెట్టిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్లా? లేనట్లా? చెప్పండి యువర్ ఆనర్’’ అని రాంగోపాల్ వర్మ వెటకారమాడారు. మూడో పోస్టులో ‘‘హే పేకీ ఫ్యాన్స్, చాలా మంది వేరే హీరోల దగుల్భాజీ ఫ్యాన్ నా కొడుకులు పవన్ కళ్యాణ్ ఇలా మంచాన పడటానికి కారణం కొవిడ్ కాదు, వకీల్ సాబ్ కలెక్షన్లు అంటున్నారు. రండి. కదలండి. ప్రాణాలకు తెగించి పీకే జేబుల్ని నింపండి’’ అని రాంగోపాల్ వర్మ డైరెక్టుగా ‘వకీల్ సాబ్’ పిక్చర్ నే టార్గెట్ చేశారు.

 

4, 5, 6 పోస్టుల్లో..

పవన్ కళ్యాణ్ బెడ్డు మీద పడుకొని ఉండటం సినిమా సెట్టింగ్ ని తలపిస్తోందనే అర్థం వచ్చేలా రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. ‘‘ఆ సెట్టింగుకి సంబంధించిన ఆర్ట్ డైరెక్షన్ లో కొంచెం తప్పు ఉన్నట్లు అనిపిస్తోంది. ఎస్ఎస్ రాజమౌళి సార్.. ఆ తప్పేంటో చెప్పమని మీరైనా కాస్త మీ ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్ ని అడగండి ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్.’’ అంటూ బాహుబలి, ఆర్ఆర్ఆర్ యూనిట్లనీ రాంగోపాల్ వర్మ ఈ వివాదంలోకి లాగాడు. అంతటితో ఆగకుండా ‘‘ఈ ఫొటోలోని ఫేక్ ఏంటో నాకు చెప్పండి. సరైన సమాధానం చెప్పినోళ్ల ఫొటోను బయటి ప్రపంచానికి వెళ్లడిస్తా. తగిన బహుమతి( రివార్డు) కూడా ఇస్తా’’ అని అభిమానులని మరింత రెచ్చగొట్టారు. ‘‘పవన్ కళ్యాణ్ బెడ్డు మీద పడుకొని ఉన్న ఫొటో ఫేక్ అని నేననట్లేదు. వేరే హీరోల దబుల్భాజీ ఫ్యాన్లంటున్నారు. వాళ్ల కట్టించడానికే పీకే ఫ్యాన్ గా ఆ ఛాలెంజ్ విసిరా’’ అని రాంగోపాల్ వర్మ తెలివిగా, చమత్కారంగా కొసమెరుపు ఇచ్చారు.

Advertisement