Ram Gopal Varma : సీఎంతో వర్మ భేటీ.. ‘వ్యూహం’పై చర్చ
NQ Staff - June 19, 2023 / 05:37 PM IST

Ram Gopal Varma : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యాడు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డితో వర్మ భేటీ అయ్యాడు. భేటీకి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడం జరిగింది.
గత కొన్నాళ్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వర్మ మాట్లాడుతూ… ట్వీట్స్ చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. జగన్ కు మద్దతుగానే వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Ram Gopal Varma Making Movie Vyuham In Support Of YS Jagan Mohan Reddy
గత కొన్నాళ్లుగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి వరుసగా విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్న విషయం తెల్సిందే. గతంలో పవన్ మరియు చంద్రబాబు నాయుడులపై సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు జగన్ కి మద్దతుగా వ్యూహం సినిమాను రూపొందిస్తున్నాడు.
ఆ సినిమా చర్చల కోసం.. జగన్ నుండి ఇన్ పుట్స్ ను తీసుకోవడం కోసం క్యాంపు కార్యాలయానికి వెళ్లాడని సమాచారం అందుతోంది. జగన్ తో భేటీ పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.