Ram Charan : యూవీ క్రియేషన్స్ లో రామ్ చరణ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
NQ Staff - December 26, 2022 / 07:38 PM IST

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా రూపొందిబోతున్న విషయం తెలిసిందే. మొదట అనుకున్నట్లుగా గౌతం తిన్ననూరి కాకుండా మరో దర్శకుడు ఈ కాంబినేషన్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
ఆ దర్శకుడు ఎవరు అనేది అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు నర్తన్ ఈ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ కి తగ్గట్లుగా ఇప్పటికే నర్తన్ ఒక స్టోరీ లైన్ సిద్ధం చేశాడట.
ఆ స్టోరీ లైన్ స్క్రిప్ట్ గా మార్చే కార్యక్రమం జరుగుతుందట. వచ్చే ఏడాది సమ్మర్ నుండి సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. హీరోగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆ వెంటనే నర్తన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న శంకర్ సినిమాకు సంబంధించిన అంచనాలు భారీగా ఉన్నాయి. రాంచరణ్ గత చిత్రం వసూళ్లు ఆయన స్థాయిని అమాంతం పెంచాయి. కనుక నర్తన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఆ స్థాయిలోనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.