RGV కి పంబ రేగిపోయే రిప్లయ్ ఇచ్చిన రామ్ చరణ్
Admin - July 25, 2020 / 07:42 AM IST
రాంగోపాల్ వర్మ తెరకేక్కిస్తున్న “పవర్ స్టార్” సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ఈ పవర్ స్టార్ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసాడు ఆర్జీవీ.
ఇక ఈ ట్రైలర్ ను చుసిన కొంతమంది సినీ ప్రముఖులు అయినా అల్లు అరవింద్, హీరో నిఖిల్ చాలా మంది స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. ఇప్పటికే కొంతమంది పవన్ ఫాన్స్ ఆర్జీవీ ఆఫీస్ పైకి దాడికి కూడా దిగారు. అయితే వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు రావడంతో అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది. తరువాత ఆర్జీవీ ఓ ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ.. ఎంత మంది అడ్డం వచ్చిన ఈ సినిమాను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసాడు.
అయితే తాజాగా మెగా ఫ్యామిలీ కుర్రోడు రామ్ చరణ్ తన ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.అయితే తాను నటించిన రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు ఫోటోను పంచుకున్న చరణ్ ‘కేవలం విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే వింటున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేశాడు.
అయితే ఈ పోస్ట్‌ను బట్టి చూస్తే.. రామ్ చరణ్ రామ్ గోపాల్ వర్మ మీదనే సెటైర్ వేస్తూ ఈ పోస్ట్ చేశారని మెగా ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ కి తెగ రిప్లయ్ లు ఇస్తున్నారు మెగా అభిమానులు.
ఇది ఇలా ఉంటె ఆర్జీవీ విడుదల చేసిన పవర్ స్టార్ సినిమా ట్రైలర్ కు యూట్యూబ్‌లో 35 లక్షల వ్యూస్‌తో అదరగొడుతోంది. ఇక ఈ సినిమాను ఈ నెల 25 వ తేదీన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించారు. ఇక చూడాలి ఈ సినిమా పై ఇంకా ఎన్ని సంఘటనలు జరుగుతాయో..!