ఖైదీ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడా?
Admin - August 6, 2020 / 07:32 AM IST

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం మూవీతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న రామ్, తరువాత విడుదల అయిన వినయ విధయ రామ చిత్రంతో భారీ ప్లాప్ ను కూడా నమోదు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ ఒక తమిళ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కార్తీ హీరో నటించిన ఖైదీ చిత్రానికి దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజుతో చరణ్ ఒక మూవీ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఖైదీ మూవీ హిట్ అయిన తరువాత లోకేష్ తో మూవీ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే రంగస్థలం నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మళ్ళీ రాం చరణ్ తో మూవీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైత్రి మేకర్స్ చరణ్ తో చేయనున్న మూవీకి లోకేష్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం నిజమైతే రాం చరణ్ తమిళ్ లో కూడా నేరుగా మూవీ చేయబోతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు.