Ram Charan Became Star Hero With Magadheera Movie : మగధీర సినిమాకు రాజమౌళి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

NQ Staff - July 23, 2023 / 03:17 PM IST

Ram Charan Became Star Hero With Magadheera Movie : మగధీర సినిమాకు రాజమౌళి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

Ram Charan Became Star Hero With Magadheera Movie :

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మగధీర ఒక ట్రెండ్ సెట్ చేసింది. జానపద సినిమాగా వచ్చిన మొదటి మూవీ ఇదే. ఇలాంటి మూవీ తీస్తే ఇండస్ట్రీ హిట్ అవుతుందని నిరూపించాడు రాజమౌళి. తెలుగు సినిమాలకు అప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేయడం అనేది ఒక పెద్ద సవాల్. అలాంటి సమయంలో వచ్చింది మగధీర.

ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తిరగరాసింది. రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. కాజల్ జాతకమే మారిపోయింది. ఇంత పెద్ద చరిత్ర సృష్టించిన ఈ సినిమాకు రాజమౌళి ముందు అనుకున్న హీరో రామ్ చరణ్‌ కాదంట.

ఆ కారణంతోనే..

Ram Charan Became Star Hero With Magadheera Movie

Ram Charan Became Star Hero With Magadheera Movie

అవును మీరు విన్నది నిజమే. ఆయన ముందుగా ప్రభాస్ తో సినిమా చేయాలని భావించాడు. కానీ అప్పటికే ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైగా ఆయన ఇలాంటి జానపద సినిమా అప్పటి వరకు చేయలేదు. రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. కానీ ఈ కథ తనకు సూట్ అవ్వదేమో అనే కారణంగా ప్రభాస్ వేరే కథ ఉంటే చెప్పు డార్లింగ్ అన్నాడంట.

కానీ రాజమౌళికి మాత్రం ఆ కథతోనే సినిమా చేయాలని ఉంది. అందుకే తన కథ కోసం స్టార్ హీరోలను వెతుకుతున్నాడు. ఆ సమయంలోనే రామ్ చరణ్‌ స్వయంగా వెళ్లి రాజమౌళిని అడిగాడు. చిరంజీవి కూడా రాజమౌళిని రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక రాజమౌళి ఆ సినిమాను చరణ్ తో తీశాడు. ఇంకేముంది చరణ్‌ జాతకమే మారిపోయింది. ఒకవేళ ప్రభాస్ చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదేమో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us