Ram Charan And Upasana Konidela : త్వరలోనే చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం.. ఉపాసన క్లారిటీ..!
NQ Staff - June 16, 2023 / 08:59 AM IST

Ram Charan And Upasana Konidela : రామ్ చరణ్ ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. వారిద్దరూ పెళ్లైన పదేండ్లకు తల్లిదండ్రులు అవుతుండటంతో మెగా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తనకు పుట్టబోయే బిడ్డ రక్తం కూడా దాచి ఉంచుతానని చెప్పింది.
ఇది తనకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్ లో ఏదైనా అనారోగ్యం వస్తే ఉపయోగపడుతుందని చెబుతోంది. ఇదిలా ఉండగా తనకు పుట్టబోయే బిడ్డ కోసం మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది ఉపాసన. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. చరణ్ నేను త్వరలోనే చిరంజీవి గారి ఇంటికి షిఫ్ట్ కాబోతున్నాం.
ఎందుకంటే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మా గ్రాండ్ పేరెంట్స్ నేర్పించన లక్షణాలే. వారి పెంపకం చాలా గొప్పది. అందుకే మా బిడ్డ కూడా వారి పెంపకంలోనే పెరిగితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. మేమిద్దరం ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటున్నాం. త్వరలోనే ఆ ఇంటిని ఖాళీ చేయబోతున్నాం.
మావయ్య, అత్తయ్యలతో కలిసి ఉండాలని మాకు కూడా ఉంది. వారితో ప్రేమను పంచుకోవడం గొప్పగా ఉంటుంది. వారి ప్రేమ మా పిల్లలకు కూడా దక్కాలి అని చెప్పుకొచ్చింది ఉపాసన. చిరంజీవి అంటేనే క్రమశిక్షణకు పెట్టింద పేరు అని అంటుంటారు. అందుకే చిరు పెంపకంలో పెరిగితే చరణ్ లాగా తన బిడ్డ కూడా గొప్పవాడు అవుతాడని ఉపాసన భావిస్తోందన్నమాట.