Rakul: స‌మంత ఐటెం సాంగ్‌పై స్ట‌న్నింగ్ కామెంట్ చేసిన ర‌కుల్ .. మ‌రో లెవ‌ల్ అంటూ ట్వీట్

Rakul:అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ సినిమా కోసం స‌మంత ఐటెం భామ‌గా అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బోస్ రాసిన ఈ పాట‌కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఒక ఎత్తైతే…ఈ ఊర మాస్ పాట‌కు సమంత వేసిన సెప్ట్ లు కుర్రాకారు గుండెల్లో రైల్లు ప‌రిగెత్తిస్తున్నాయి. ఇప్ప‌టికే త‌న విభిన్న‌మైన గొంతుతో విశేష ప్ర‌జాద‌ర‌ణ పొందిన సింగ‌ర్ మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను పాడిన విధానం ఇప్పుడు అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.

rakul stunning comment on samantha3
rakul stunning comment on samantha3

పుష్ప సినిమాతో పాటు స‌మంత సాంగ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుష్ప చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ పై ఒక రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించింది. ‘పుష్ప.. ఉఫ్.. విజిల్ కొట్టించే స్టైల్, క్రేజ్.. నా ఫేవరిట్ అల్లు అర్జున్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్.. ఇలాంటి పాత్రలు నువ్వు మరిన్ని చేయాలి.

సుకుమార్ సర్ ప్రతి సారి కొత్త ప్రపంచం సృష్టిస్తారు. రష్మిక అద్భుతంగా నటించింది అందంగా కనిపించింది. ఇక సమంత.. ఆమె గురించి ఏం చెప్పను.. సమంత హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఫహద్ ఫాజిల్ ఇంటెన్స్ గా నటించారు. పుష్ప చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ రకుల్ పోస్ట్ పెట్టింది. రకుల్ అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

rakul stunning comment on samantha1
rakul stunning comment on samantha1

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ వైవిధ్యమైన నటనతో అదరగొట్టాడు. ఇక రష్మిక పల్లెటూరి యువతిగా కట్టిపడేసింది. ఈ చిత్రంలో సమంత తొలిసారి ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ లో సామ్ హాట్ గా కనిపించింది అంటూ రకుల్ కామెంట్స్ చేసింది.

స‌మంత త‌మిళంతో పాటు హిందీలోనూ సినిమాలు ఒప్పుకుంటున్నారు . రీసెంట్‌గా సమంత.. మరో సినిమాకు సైన్ చేసింది. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ చిత్రంలో యాక్ట్ చేస్తోంది. దాంతో పాటు సామ్ నటించిన ‘శాకుంతలం’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. దీంతో పాటు హిందీ,తమిళంలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసింది.