Rakul Preet Singh : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆ తెలుగు హీరోను ప్రేమించిందా.. పెళ్లికి అడ్డుపడిందెవరు..?

NQ Staff - January 29, 2023 / 05:46 PM IST

Rakul Preet Singh : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆ తెలుగు హీరోను ప్రేమించిందా.. పెళ్లికి అడ్డుపడిందెవరు..?

Rakul Preet Singh : రకుల్‌ ప్రీత్‌ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె నార్త్‌ నుంచి వచ్చి తెలుగులో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ముందుగా బాలీవుడ్‌ లోనే కెరీర్‌ ను స్టార్ట్ చేసింది. కానీ అక్కడ అనుకున్నంత సక్సెస్‌ రాకపోయేసరికి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది.

చాలా తక్కువ సమయంలోనే లక్కీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది ఈ భామ. చేసిన వాటిల్లో ఎక్కువగా హిట్లే ఉండేసరికి ఆమెకు చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ దక్కింది. తెలుగులో మహేశ్ బాబు, రామ్ చరన్‌, బన్నీ, ఎన్టీఆర్‌, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.

ఇల్లు కొనిచ్చిన హీరో..

Rakul Preet Singh Had Love Affair With Daggubati Rana

Rakul Preet Singh Had Love Affair With Daggubati Rana

అలాగే తమిళంలో సూర్య, కార్తీ, విజయ్ లాంటి అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేసింది. కాగా సౌత్‌ లో అగ్ర హీరోయిన్ గా ఉన్నప్పుడే హీరో రానాతో ఆమె లవ్‌ స్టోరీ నడిపిందనే టాక్ వినిపించింది. ఆమెకు హైదరాబాద్‌ లో రానా ఇల్లు కూడా కొనిచ్చాడంటూ వార్తలు వచ్చాయి. పైగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ తో  కలిసి జిమ్‌లు కూడా ఓపెన్‌ చేశాడు.

వీరిద్దరూ బిజినెస్ పార్ట్‌నర్లు కూడా అయ్యారు. అలా ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. దాంతో అప్పట్లో వీరిద్దరూ పబ్బులు, పార్టీలు అంటూ బాగానే ఎంజాయ్‌ చేశారు. కానీ మధ్యలోనే విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక రానా వేరే అమ్మాయిని పెండ్లి చేసుకుని సెటిల్‌ అయిపోయాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us