రియాతో డ్రగ్స్ గురించి చాట్ చేసిన విషయం వాస్తవం: రకుల్

బాలీవుడ్ లో డ్రగ్స్ విషయం కలకలం సృష్టిస్తుంది. ఈ కరోనా కష్టకాలంలో కూడా అధికారులు ఈ డ్రగ్స్ వ్యవహారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్నట్టు అంగీకరించిన రీయా చక్రవర్తి, ఆమె య్సోదరుడు సోయక్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్న ఎన్సీబీ అధికారులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ లకు నోటీసులు జారీ చేయగా ఇవ్వాళ రకుల్ ప్రీత్సింగ్ విచారణకు హాజరు అయ్యారు. ఈ విచారణలో రకుల్ సంచలన విషయాలను బయటపెట్టింది.

డ్రగ్స్ విషయమై రియా చక్రవర్తితో చాట్ చేశానని, అయితే తాను డ్రగ్స్ వాడలేదని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. 2017లో ఒక వాట్స్ యాప్ గ్రూప్ లో డ్రగ్స్ గురించి చాట్ జరిగింది. ఈ గ్రూప్ కి అడ్మిన్ గా ఉన్నారని మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. రేపు దీపికా పదుకొనే విచారణకు ఎన్సీబీ అధికారులు ఎదుట హాజరు కానున్నారు. డిప్రెషన్ గురించి ప్రసంగాలు ఇచ్చే దీపికా పదుకొనే ఈ డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ అవుతున్నాయి. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇంకెంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.